బలవంతంగా వైసీపీ కండువా కప్పారు.. మహిళా నేత కామెంట్స్

Published : Mar 22, 2019, 02:53 PM IST
బలవంతంగా వైసీపీ కండువా కప్పారు.. మహిళా నేత కామెంట్స్

సారాంశం

తనకు బలవంతంగా వైసీపీ కండువా కప్పారని.. తాను ఎప్పటికీ టీడీపీలోనే కొనసాగుతానంటూ ఓ మహిళా నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. 

తనకు బలవంతంగా వైసీపీ కండువా కప్పారని.. తాను ఎప్పటికీ టీడీపీలోనే కొనసాగుతానంటూ ఓ మహిళా నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. పిఠాపురం పట్టణం 14వ వార్డు కౌన్సిలర్ దుగ్గాడ విజయలక్ష్మి గురువారం టీడీపీ నేతల సమక్షంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

తెలుగుదేశం పార్టీలో ఉన్న తనతో మాట్లాడటానికి ఇటీవల వైసీపీ నేత ఒకరు వచ్చారని.. తన అనుమతి కూడా కోరకుండా.. ఆ పార్టీ కండువాను తన మెడలో వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారు చేసిన పనికి తాను షాకయ్యానని ఆమె చెప్పారు.

టీడీపీలో ఉన్న తనకు వైసీపీ జెండా ఎలా వేస్తారని ఆమె ప్రశ్నించారు. ఇలా చేయడం వైసీపీ నేతలకు సమంజసమం కాదని చెప్పారు. తాను ఎప్పటికీ టీడీపీలోనే ఉంటానని.. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రజల్లో టీడీపీకి పెరుగుతున్న ఆదరణ చూడలేక వైసీపీ నేతలు ఇలా చేశారని ఆమె ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే