ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ సభ్యులు బుధవారం నాడు వెరైటీ నిరసనకు దిగారు. చిడతలు వాయిస్తూ టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం నాడు TDP సభ్యులు చిడతలు వాయించారు. టీడీపీ సభ్యుల తీరుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ Tammineni Sitaramఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు చిడతలు వాయించడం ప్రారంభించారు.టీడీపీ సభ్యుల తీరును స్పీకర్ తప్పు బట్టారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినరా అంటూ స్పీకర్ టీడీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. ప్రతి రోజూ ఇలానే వ్యవహరిస్తారా అంటూ స్పీకర్ TDP సభ్యుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంస్కారం ఉందా అని కూడా టీడీపీ సభ్యులపై తమ్మినేని సీతారాం ఫైరయ్యారు. శాసనసభ జౌన్నత్యాన్ని దిగజారుస్తున్నారని స్పీకర్ మండిపడ్డారు. మీరు రోజు రోజుకి దిగజారిపోతున్నారన్నారు. మీకు ఓటేసిన ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారని స్పీకర్ చెప్పారు.
టీడీపీ సభ్యుల తీరును అధికార వైసీపీ సభ్యులు తీవ్రంగా ఎండగట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో చిడతలు వాయించుకోవాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్యే Ambati Rambabu చెప్పారు. ఇప్పుడైనా టీడీపీకి 23 స్థానాలు దక్కాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానాలు కూడా దక్కవన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత టీడీపీ సభ్యులు చిడతలు వాయించుకోవాల్సిందేనని ఆయన ఎద్దేవా చేశారు.నిన్న అసెంబ్లీలో విజిల్స్ వేశారు, ఇవాళ చిడతలు వాయించారు. రేపు ఏం చేస్తారోనని అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.
టీడీపీ సభ్యులకు ప్రజలు బడితెపూజ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ హెచ్చరించారు. మీరు అసెంబ్లీకి ఎందుకు వచ్చారని Jogi Ramesh టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.