ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలు పునః.ప్రారంభించి కరోనా నిబంధనలకు తూట్లు పొడుస్తోందని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య.
ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలు పునః.ప్రారంభించి కరోనా నిబంధనలకు తూట్లు పొడుస్తోందని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్నపు ప్యాకెట్లు పంచేటప్పుడు సామాజిక దూరం అంటూ ఆంక్షలు విధించిన ప్రభుత్వం మందుబాబులు బయటకు రావడానికి అనుమతిచ్చి భౌతిక దూరానికి గేట్లు ఎత్తేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
undefined
Also Read:మద్యం దుకాణాల రీ ఓపెన్‌తో కరోనా వ్యాప్తి: చంద్రబాబు ఆందోళన
గ్రీన్ జోన్ లో త్రాగిన మందు బాబులు రెడ్ జోన్ లో ప్రవేశించి ఆగడాలు చెయ్యకుండా నిరోధించడం పోలీసులకు అసాధ్యమని ఆలోచించక్కరలేదా అని వర్ల ప్రశ్నించారు.కరోన నియంత్రణ గాలికొదలకండి సార్" అని వర్ల రామయ్య విన్నవించుకున్నారు.
ఏపీవైపు తరుముకొస్తున్న ఎంఫాన్ తుపానుతో ముప్పుఏమోగానీ, మద్యం షాపులు తెరవడంతో ఆదాయంలేని బడుగుల కుటుంబాల్లో ఇక అల్లకల్లోలమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ప్రాణాలు పోతే ఎవరికి కావాలి, ఇళ్ళల్లో శాంతిపోతే ఏమవుతుందన్న ఇంగిత జ్ఞానంతో ప్రభుత్వం మసలుకోవడం లేదని వర్ల మండిపడ్డారు. మద్యం దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో మందుబాబులు సామాజిక దూరం పాటించడాన్ని భగ్నం చేసినందుకు వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
Also Read:ఎన్టీఆర్ విధానాన్ని కొనసాగించి వుంటే.. ఈ పరిస్ధితి ఉండేదా: బాబుపై ధర్మాన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి గారు.. మందుబాబులను సంతృప్తి పరచడానికి కరోనా లాక్‌డౌన్‌తో సతమతమవుతున్న పోలీసులపై మద్యం షాపుల వద్ద గుంపును అదుపు చేయడంలో అదనపు భారం భావ్యమా అని రామయ్య నిలదీశారు.