బాపట్ల సంతమాగులూరు వద్ద రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

Published : Sep 03, 2023, 10:08 AM IST
బాపట్ల సంతమాగులూరు వద్ద  రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

సారాంశం

బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో  మృతి చెందిన వారిలో నలుగురు మహిళలే ఉన్నారు. 

అమరావతి: బాపట్ల జిల్లా సంతమాగులూరు వద్ద  ఆదివారంనాడు జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.గుంటూరు-కర్నూల్ జాతీయ రహదారిపై  ఆటోను లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో  అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతి చెందారు.

ఈ ప్రమాదంలో  మృతి చెందిన ఐదుగురిలో  నలుగురు మహిళలే ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన  మరో ఇద్దరిని  నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. నరసరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురంలో వేడుకకు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.బాధితులు  గుంటూరుకు చెందిన క్యాటరింగ్  సిబ్బందిగా గుర్తించారు. 
 

PREV
click me!

Recommended Stories

మరికొన్ని గంటల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు.. 365 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు.. భారీ ఏర్పాట్లు
మురసు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం | CM Chandrababu Reviews Flood Situation