రాయచోటిలో టీడీపీకి షాక్: ఇండిపెండెంట్ గా బరిలోకి టీడీపీ నేత

By Nagaraju penumalaFirst Published Feb 24, 2019, 8:11 AM IST
Highlights

మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. రమేష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యాలని భావిస్తున్నట్లు తెలిపారు. 

కడప: కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశంలో వర్గవిబేధాలు బట్టబయలయ్యాయి. రాయచోటి అభ్యర్థిగా రమేష్ రెడ్డిని ప్రకటించడాన్ని నిరసిస్తూ టీడీపీకి చెందిన కీలక నేత అసంతృప్తి వ్యక్తం చేశారు. 

రాయచోటి నుంచి బరిలోకి దిగుతామని ఆశించిన సుగవాసి బాల సుబ్రమణ్యం ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని హెచ్చరించారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్‌ తగిలినట్లేనని చెప్పుకోవచ్చు. రాయచోటి నియోజకవర్గంలో మంచి పట్టున్న సుగవాసి పాలకొడ్రాయుడు కుమారుడు కావడంతో రాజకీయాల్లో కలవరం రేపుతున్నాయి. 

మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. రమేష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యాలని భావిస్తున్నట్లు తెలిపారు. 

సుబ్రమణ్యం గతంలో జెడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలసుబ్రమణ్యం పోటీ చేశారు. రాయచోటి అభ్యర్థిగా రమేస్ రెడ్డిని ప్రకటించడంపైకార్యకర్తల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. 

పాలకొండ్రాయుడు మరో తనయుడు ప్రసాద్ మాత్రం రమేష్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఇద్దరి మధ్య చంద్రబాబు సయోధ్య కుదర్చడంతో ఆయన రమేష్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. దాంతో ప్రసాద్ కు టీటీడీ బోర్డు మెంబర్ గా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. 

click me!