కర్నూలులో పవన్ కళ్యాణ్ రోడ్ షో, 3రోజులపాటు అక్కడే

By Nagaraju penumalaFirst Published 24, Feb 2019, 7:54 AM IST
Highlights

సీ క్యాంపు సెంటర్ నుంచి నుంచి కొండారెడ్డి బురుజు వరకు జనసేన పార్టీ నిర్వహించనున్న రోడ్ షో లో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. 25న ఆదోని నియోజకవర్గంలో పర్యటించి అక్కడ రైతులతో పవన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. 

కర్నూల్: రాయలసీమ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఆదివారం నుంచి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మూడురోజుల పాటు జిల్లాలోనే పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. జిల్లాలోని సమస్యలపై  ప్రజలను అడిగి తెలుసుకోనున్నారు. 

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలుకు చేరుకుని అక్కడ నుంచి సి క్యాంపు సెంటర్ కు చేరుకుంటారు. సీ క్యాంపు సెంటర్ నుంచి నుంచి కొండారెడ్డి బురుజు వరకు జనసేన పార్టీ నిర్వహించనున్న రోడ్ షో లో పాల్గొంటారు. 

 

Last Updated 24, Feb 2019, 7:54 AM IST