చంద్రబాబుతో పవన్ భేటీ.. ప్యాంట్లు తడిచిపోతున్నట్లున్నాయి, డైపర్స్ వాడండి : వైసీపీ నేతలకు సోమిరెడ్డి కౌంటర్

Siva Kodati |  
Published : Jan 08, 2023, 04:55 PM IST
చంద్రబాబుతో పవన్ భేటీ.. ప్యాంట్లు తడిచిపోతున్నట్లున్నాయి, డైపర్స్ వాడండి : వైసీపీ నేతలకు సోమిరెడ్డి కౌంటర్

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల భేటీపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ నేతలు, మంత్రులకు ప్యాంట్లు తడిచిపోతున్నట్టున్నాయని వాళ్లు డైపర్స్ వాడితే బెటర్ అంటూ ఆయన సెటైర్లు వేశారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల భేటీ తెలుగు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైసీపీ నేతలు తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటరిచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీతో వైసీపీ నేతలు, మంత్రులకు ప్యాంట్లు తడిచిపోతున్నట్టున్నాయి... ఎందుకైనా మంచిది, ముందు జాగ్రత్తగా డైపర్స్ వాడండి అంటూ సోమిరెడ్డి సెటైర్లు వేశారు. 

అంతకుముందు చంద్రబాబుతో  జనసేన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ ల సమావేశంపై  వైసీపీ తీవ్రంగా మండిపడింది.   గంగిరెద్దులు  సంక్రాంతికి  ఇంటింటికి  తిరుగుతాయన్నారు. అలాగే చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్  వెళ్లాడని అంబటి రాంబాబు విమర్శించారు. డుడు బసవన్నలా  తల ఊపడానికే  చంద్రబాబుతో  పవన్ కళ్యాణ్ భేటీ అయ్యాడన్నారు. ట్విట్టర్ వేదికగా  పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీపై  మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. 

ALso REad: సంక్రాంతి మామూళ్ల కోసం, గంగిరెద్దు మాదిరిగా : చంద్రబాబుతో పవన్ భేటీపై వైసీపీ తీవ్ర విమర్శలు

సంక్రాంతి మామూళ్ల కోసమే  దత్తతండ్రి దగ్గరికి దత్తపుత్రుడు వెళ్లాడని ఏపీ మంత్రి అమర్నాద్ వ్యాఖ్యానించారు. ట్విట్టచ్ వేదికగా  అమర్నాద్ ఈ విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటేనని  తాము ఎప్పటి నుండే చెబుతున్నామని  ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు  గుర్తు చేశారు. రాష్ట్రం కంటే  వీళ్ల ప్రయోజనాలే ఈ ఇద్దరికి ముఖ్యమని నాగేశ్వరరావు  తెలిపారు. రాష్ట్యాన్ని దోచుకోవడం, దాచుకోవడం కోసమే  ఈ ఇద్దరి నేతల ప్రయత్నమని   మంత్రి కారుమూరి నాగేశ్వరరావు  చెప్పారు. 

2014లో  కూటమిగా పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీలు  రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చాయని వైసీపీ ఎమ్మెల్యే  మల్ది విష్ణు ఆరోపించారు.  చంద్రబాబు చెప్పినట్టుగా చేస్తున్నాడనే పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అంటున్నామన్నారు.  ఈ భేటీతో వీరిద్దరి ముసుగు తొలగిపోయిందని ఆయన చెప్పారు

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!