కడపలో టీడీపీకి షాక్: బీజేపీలో చేరిన మాజీ మంత్రి

By Siva KodatiFirst Published Jul 8, 2019, 7:42 AM IST
Highlights

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్.రామముని రెడ్డి బీజేపీలో చేరారు. 1982లో ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్.రామముని రెడ్డి బీజేపీలో చేరారు. 1982లో ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి ఎన్నికై ఎన్టీఆర్ తొలి మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  

అనంతరం 1984లో జరిగిన రాజకీయ సంక్షోభంలో నాదెండ్ల భాస్కర్‌రావు వర్గంలో మంత్రిగా పనిచేశారు. అయితే ఆ తర్వాత టీడీపీలో రాజకీయంగా పెను మార్పులు రావడం.. పార్టీ చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్లడంతో రామమునిరెడ్డి క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

అనంతరం తిరిగి మరోసారి టీడీపీలో చేరి 1999లో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. పదవీకాలం ముగిసిన తర్వాత చాలాకాలం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో బీజేపీ విధానాల పట్ల ఆకర్షితులైన ఆయన శనివారం ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. 

click me!