నారా లోకేష్ పాదయాత్రకు ముహుర్తం ఫిక్స్.. ఏడాది పాటు యాత్ర సాగేలా ప్లాన్..

Published : Nov 11, 2022, 02:36 PM IST
నారా లోకేష్ పాదయాత్రకు ముహుర్తం ఫిక్స్.. ఏడాది పాటు యాత్ర సాగేలా  ప్లాన్..

సారాంశం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ త్వరలోనే పాదయాత్ర చేపట్టనున్నారనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన పాదయాత్రపై నారా లోకేష్ స్పష్టతనిచ్చారు. 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ త్వరలోనే పాదయాత్ర చేపట్టనున్నారనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన పాదయాత్రపై నారా లోకేష్ స్పష్టతనిచ్చారు. 2023 జనవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ తన పాదయాత్ర ప్రారంభించేందుకు లోకేష్ సిద్దమయ్యారు. ఏడాది  పాటు ప్రజల్లో ఉండేల్లా లోకేష్ పాదయాత్రను ప్లాన్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర సాగనుంది. పాదయాత్ర రూట్ మ్యాప్‌పై కసరత్తు తుదిదశకు చేరుకుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. 

ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి నారా లోకేష్ పాదయాత్ర ముగించేలా షెడ్యూల్‌ను రూపొందించనున్నారు. అన్ని ప్రాంతాలను సందర్శించేలా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా లోకేష్ పాదయాత్ర సాగనుంది. నారా లోకేష్ పాదయాత్ర ద్వారా పార్టీకి క్షేత్రస్థాయిలో జోష్ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీ కోసం పేరుతో పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్