తమ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు అనుకూలమైన విధానాలు అవలంభించడంతో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తున్నారని ఏపీ సీఎం జగన్ చెప్పారు. ఇవాళ వంకాయలపాడులో స్పైసెస్ యూనిట్ నుసీఎం ప్రారంభించారు.
యడ్లపాడు:ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.పల్నాడు జిల్లాలోని వంకాయలపాడులో ఐటీసీకి చెందిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ను శుక్రవారంనాడు సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరుసగా మూడేళ్లుగా ప్రథమస్థానంలో నిలిచిందని ఆయన గుర్తుచేశారు.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తను అడిగి మరీ ర్యాంకు ఇచ్చారని సీఎం జగన్ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పూరి గొప్పగా మాట్లాడారన్నారు.. ఆయన నోట్లోంచి ఈ మాటలు రావడమే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి అధికారి పనితీరుకు నిదర్శనంగా పేర్కొన్నారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా ఏపీ నెంబర్ వన్ స్ధానం తీసుకోవడం అంటే ఇదొక గొప్ప మార్పు.గా ఆయన పేర్కొన్నారు. ఏదైనా అవసరం ఉంటే ఒక్క పోన్ చేస్తే తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం జగన్ ఈ సంర్భంగా చెప్పారు.
దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్ ప్లాంట్ మన రాష్ట్రంలోనే ఉంటుందని ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పూరి చెప్పారన్నారు..ఇప్పటికే 20వేల మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ యూనిట్ పెడుతున్నారన్నారు. దీనివల్ల దాదాపుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 మంది ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని సీఎం చెప్పారు.ఈ ప్లాంట్ తో ఈ ప్రాంతంలో ఉన్న 14వేల మంది రైతులకు ఇది ఒక గొప్ప వరంగా మారుతుందని సీఎం చెప్పారు.నవంబరు 2020లో ఈ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించారన్నారు.. 24 నెలల కాలంలోనే ఈ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి చేశారని సీఎం గుర్తుచేశారు. ఇంత వేగంగా అడుగులు పడ్డాయంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంత ఉందన్నదానికి వేరే నిదర్శనం అవసరం లేదన్నారు.
undefined
ఇలాంటి పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇంకా ఎక్కువ రావాలని ఇప్పటికే కార్యాచరణ చేశామన్నారు. ప్రతి జిల్లాలోనూ రైతులు పండించే పంటలన్నింటికీ మెరుగైన ధర రావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రైతులకు ఇంకా మెరుగైన పరిస్థితులు ఉండాలన్నారు. దీంతో 26 పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రూ.3450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నట్టుగా సీఎం చెప్పారు. దీనివల్ల ప్రతి జిల్లాలో ఉన్న రైతులకు మేలు చేయడమే కాకుండా దాదాపు 33వేల ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతామన్నారు.ఇందులో ఫేజ్ –1 కు సంబంధించి 10 యూనిట్ల కోసం రూ.1250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే కార్యక్రమాలు డిసెంబరు, జనవరిలో శంకుస్ధాపన చేయనున్నామని సీఎం వివరించారు.. ఇవన్నీ ఒక్కసారి పూర్తైతే, మరో రెండు మూడేళ్లలో ఈ 26 అందుబాటులోకి వస్తాయన్నారు.
ఇలాంటి ప్రాసెసింగ్ యూనిట్లు మన రాష్ట్రంలో రావడం వల్ల మన రైతులుకు కచ్చితంగా మేలు జరుగుతుందన్నారు. ఇ వందల కోట్ల పెట్టుబడితో ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినందున మన రైతుల ఉత్పత్తులకు మెరుగైన రేటు ఇచ్చి రైతులను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమంలో ఐటీసీ ముందడుగు వేస్తుందన్నారు.ఇటువంటి గొప్ప మార్పులు వ్యవసాయరంగంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. . ఇల తమ ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల స్ధాపనతో పడిందన్నారు..