జగన్ పాలనలో సొంతింట్లో కూడా మహిళలకు భద్రత లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. దిశ చట్టం కింద 21 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా చూస్తామన్నారు.. కానీ, 21 నెలలైనా నేరస్థులకు శిక్షపడట్లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. నరసరావుపేట పర్యటనకు విజయవాడ వచ్చిన నారా లోకేశ్‌కు నోటీసులు ఇచ్చి ఉండవల్లిలోని నివాసానికి పోలీసులు తరలించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం, విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం, కొవిడ్ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలకు సంబంధించి నోటీసు జారీ చేసినట్టు కృష్ణలంక పోలీసులు తెలిపారు. అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. సొంత చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు.
ALso Read:లోకేష్‌వి శవ రాజకీయాలు.. ఆయన రాజకీయాల్లో ఎప్పటికీ పులకేసీనే: వైసీపీ ఎమ్మెల్యే
జగన్ పాలనలో సొంతింట్లో కూడా మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ చట్టం కింద 21 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా చూస్తామన్నారు.. కానీ, 21 నెలలైనా నేరస్థులకు శిక్షపడట్లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు. తాడేపల్లి, పులివెందుల సహా ఎక్కడా మహిళలకు భద్రత లేదని.. ఫిర్యాదు చేసేందుకు వెళ్తోన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. జగన్ నివాసం సమీపంలో మహిళలపై ఎన్నో ఘోరాలు జరిగాయని లోకేశ్ దుయ్యబట్టారు. నరసరావుపేటలో అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్తుంటే అంత భయమెందుకు అని లోకేశ్ ప్రశ్నించారు.