రాజమండ్రి జైలును పేల్చేస్తామంటూ లేఖ .. చంద్రబాబుపై భద్రతపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Oct 6, 2023, 9:53 PM IST

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . జైలుపై దాడి చేస్తామని కొందరు పోలీసులకు లేఖ పంపించారని, ఇంకొందరు జైలు పరిసరాల్లో డ్రోన్ ఎగురవేశారని జైల్లో చంద్రబాబు భద్రతపై నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.  


కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో శుక్రవారం చంద్రబాబును భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేష్ ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిని ప్రశ్నించినందుకే చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులు బయటపెట్టి.. ప్రజల తరపున పోరాడితే అక్రమ కేసులు పెట్టారని, 28 రోజులుగా రిమాండ్‌లో పెట్టారని లోకేష్ దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తొలుత రూ.3 వేల కోట్లు అని చెప్పి.. అనంతరం రూ.300 కోట్లు అని ఆరోపించారు. 

రిమాండ్‌లో వుంచినా ఆయన అధైర్య పడలేదు.. పోరాటం ఆపవద్దు , శాంతియుతంగా పోరాడాలని తమతో చెప్పారని లోకేష్ తెలిపారు. తమ కుటుంబం మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం రోడ్డు మీదకి తెచ్చిందని.. తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాడుతున్నామని చెప్పారు. ఢిల్లీలో రాష్ట్రపతిని, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిసి ఏపీలోని పరిస్ధితిని వివరించామని నారా లోకేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని.. కక్ష సాధింపు చర్యల కారణంగా రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదన్నారు. 

Latest Videos

ALso Read: రాజమండ్రి వెళుతున్న లోకేష్ కు మహిళల మంగళహారతులు... ప్లకార్డులతో సందడి (ఫోటోలు)

మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతపై నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. జైలుపై దాడి చేస్తామని కొందరు పోలీసులకు లేఖ పంపించారని, ఇంకొందరు జైలు పరిసరాల్లో డ్రోన్ ఎగురవేశారని పేర్కొన్నారు. ఇదే జైలులో కొందరు నక్సలైట్లు, గంజాయి విక్రయించేవారు ఖైదీలుగా వున్నారని నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై 175 నియోజకవర్గాల్లో నిరసన తెలియజేస్తామని.. బాబుతో నేను కార్యక్రమాన్ని గడప గడపకు తీసుకెళ్తామని నారా లోకేష్ తెలిపారు. తన యువగళం పాదయాత్ర, ఇతర కార్యక్రమాలపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని నారా లోకేష్  స్పష్టం చేశారు. 
 

click me!