జగన్ కళ్ళు మూసుకుని ఆడితే... క్లీన్ బౌల్డ్ లేదంటే స్టంపౌట్ : నారా లోకేష్ సెటైర్లు

Siva Kodati |  
Published : Jul 27, 2022, 08:20 PM IST
జగన్ కళ్ళు మూసుకుని ఆడితే... క్లీన్ బౌల్డ్ లేదంటే స్టంపౌట్ : నారా లోకేష్ సెటైర్లు

సారాంశం

అసత్యాలు ప్రచారానికి సాక్షి బ్రాండ్ అంబాసిడరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సాక్షిని మించిన అసత్యాలు ఎక్కడాలేవని... జగన్ దోపిడీని దశల వారీగా బయటపెడతామని ఆయన హెచ్చరించారు. 

మీడియాపై ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్ అంటున్న జగన్ (ys jagan) క్లీన్ బౌల్డ్ లేదా స్టంప్ అవుట్ కాక తప్పదన్నారు టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ (nara lokesh). బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... జగన్ కళ్ళు మూసుకుని ఆడే ఫ్రంట్ ఫుట్ తో బొక్కబోర్లా పడక తప్పదని జోస్యం చెప్పారు. అసత్యాలు ప్రచారానికి సాక్షి బ్రాండ్ అంబాసిడరని లోకేశ్ ఎద్దేవా చేశారు. సాక్షిని మించిన అసత్యాలు ఎక్కడాలేవని... జగన్ దోపిడీని దశల వారీగా బయటపెడతామని ఆయన హెచ్చరించారు. 

దొంగే దొంగా దొంగా అనే రీతిలో మొదటి నుంచీ జగన్ వ్యవహారం ఉందని నారా లోకేశ్ దుయ్యబట్టారు. వరద ప్రాంతాల్లో జగన్ పర్యటన బూటకమని.. తాము వేసిన సిమెంట్ రోడ్డుపైనే నిన్న జగన్ తిరిగారని ఆయన ఎద్దేవా చేశారు. వెనుక కార్లు కూడా వస్తుంటే ముందు ట్రాక్టర్‌పై జగన్ వెళ్లాల్సిన పనేముందని నారా లోకేష్ ప్రశ్నించారు. పోలవరం విలీన మండలాల్లో వాస్తవాలను చంద్రబాబు రేపు బయటపెడతారని ఆయన చెప్పారు. విలీన  ప్రాంతాల ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో తేటతెల్లమవుతుందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.     

Also REad:వివాదం వేళ.. పోలవరం ముంపు ప్రాంతాల పర్యటనకు చంద్రబాబు, భద్రాద్రిలో బస... షెడ్యూల్ ఇదే

ఇకపోతే... ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో బాధితులను టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) పరామర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పోలవరం ముంపు ప్రాంతాల (polavaram ) పర్యటనకు టీడీపీ అధినేత బయల్దేరనున్నారు. గురు, శుక్ర వారాల్లో ఆయన విలీన మండలాల్లో పర్యటించనున్నారు. 

గురువారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయల్దేరి వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలోని శివకాశిపురం, కుక్కునూరుల్లో పర్యటిస్తారు. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్‌లోనూ చంద్రబాబు పర్యటించనున్నారు. గురువారం రాత్రికి భద్రాచలంలోనే బస చేయనున్న ఆయన.. శుక్రవారం భద్రాద్రి శ్రీ సీతారామస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం రెండో రోజూ పర్యటనలో భాగంగా ఏటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని తోటపల్లి, కోతుల గుట్ట, రేఖపల్లి గ్రామాల్లో పర్యటించి.. వరద బాధితులకు భరోసా కల్పించనున్నారు చంద్రబాబు . 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం