సోదరా నాని... నువ్వు చంద్రబాబును అనేంత వాడివా...!: కేశినేని చిన్ని కౌంటర్

By Arun Kumar PFirst Published Jan 11, 2024, 1:17 PM IST
Highlights

విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసిపి చేరేందుకు సిద్దమై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేయడాన్ని కేశినేని చిన్ని తప్పుబట్టారు. 

అమరావతి : తెలుగుదేశం పార్టీని వీడి వైసిపిలో చేరేందుకు సిద్దమైన విజయవాడ ఎంపీ కేశినేని నానికి సోదరుడు కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. రాజకీయ స్వార్థం కోసం తన కుటుంబంలో చంద్రబాబు నాయుడు చిచ్చు పెట్టారని... కుటుంబసభ్యులతోనే కొట్టించే ప్రయత్నం చేసారన్న నాని ఆరోపణలపై చిన్ని స్పందించారు. తమ కుటుంబంలో 1999 నుండి  కలహాలు వున్నాయని... వాటితో చంద్రబాబుకు సంబంధం లేదని చిన్ని తెలిపారు. అన్న నాని అప్పటినుండే తనను ఇబ్బంది పెడుతూ వస్తున్నాడని ...  ఇంతకాలం సర్దుకుంటూ పోయానని చిన్ని పేర్కొన్నారు. 

రాజకీయ స్వార్థంతో చంద్రబాబు, నందమూరి కుటుంబాలపై నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని... ఆ అర్హత కూడా నానికి లేదని సోదరుడు హెచ్చరించాడు. చంద్రబాబు పెట్టిన బిక్షే ఇప్పుడు నాని రాజకీయ జీవితమని అన్నారు. ఇంతకాలం మంచి అవకాశాలు ఇచ్చి రాజకీయంగా ఎదిగేందుకు చంద్రబాబు సాయపడ్డారు... అలాంటి నాయకున్ని పార్టీ మారగానే తిట్టడం భావ్యం కాదన్నారు కేశినేని చిన్ని. 

Latest Videos

Also Read  చంద్రబాబు మోసగాడు, టీడీపీని ఖాళీ చేస్తా:కేశినేని నాని సీరియస్ కామెంట్స్

ఎందరో మహామహులు టిడిపి వీడినా ఈ పార్టీకి ఏం కాలేదని కేశినేని చిన్ని అన్నారు. వచ్చేవాళ్లు వస్తుంటారు... పోయేవాళ్లు పోతుంటారు... కానీ పార్టీ మాత్రం శాశ్వతమని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలంతో నడుస్తుందని... అందువల్లే ఈ పార్టీని ఎవరూ ఏం చేయలేకపోయారని చిన్ని అన్నారు. ఇకపై కూడా టిడిపి వైభవం ఇలాగే కొనసాగుతుందని కేశినేని చిన్ని అన్నారు. 

కేశినేని నాని ఏమ్మన్నాడంటే : 

సోదరుడు చిన్నితో విబేధాలు, టిడిపిలో ప్రాధాన్యత తగ్గడంతో ఎంపీ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు కేశినేని. ఇప్పటికే రాజీనామా ప్రకటన చేసిన ఎంపీ వైసిపిలో చేరేందుకు సిద్దమయ్యారు. సీఎం, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన నాని వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే లోక్ సభ స్పీకర్ కు ఎంపీ పదవికి రాజీనామా చేసిన లేఖను పంపించారు. అలాగే చంద్రబాబుకు టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు మరో లేఖను నాని పంపించారు.  

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ... చంద్రబాబు మోసగాడని ప్రపంచానికి తెలుసన్నారు. అయితే ఆయన గురించి తెలుసుకునేందుకు తనకు చాలా సమయం పట్టిందన్నారు. టిడిపి పార్టీ తనకు చేసిందానికంటే ఎక్కువగా తాను పార్టీకి చేసానని  ...  వేల కోట్లు ఖర్చు చేసుకున్నానని నాని అన్నారు. అలాంటి తనను చాలా కాలంగా అవమానించడం, వేధించడం చేసారని నాని ఆవేదన వ్యక్తం చేసారు. 

నారా లోకేష్ కేవలం చంద్రబాబు నాయుడు కొడుకు అనే అర్హతతో తమపై పెత్తనం చెలాయించేవాడని నాని అన్నారు. అసలు ఏ అర్హతతో లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించాడని ప్రశ్నించాడు.  చంద్రబాబు కొడుకుగా  తప్ప లోకేష్ కు ఉన్న అర్హత ఏమిటి? అని నిలదీసారు. ఆఫ్ట్రాల్  ఓడిపోయిన ఎమ్మెల్యే అంటూ  లోకేష్ పై  కేశినేని నాని మండిపడ్డారు. 

click me!