ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎఫెక్ట్: కన్నబాబు దీక్ష, బాబుకు షాకిస్తారా?

First Published Jul 30, 2018, 1:07 PM IST
Highlights

నెల్లూరు జిల్లా టీడీపీలో గ్రూపుల తగాదాలు  కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూర్  పార్టీ  ఇంచార్జీ పదవిని  మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డికి కట్టబెట్టడం పట్ల పార్టీ నేత కన్నబాబు తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. 


నెల్లూరు: నెల్లూరు జిల్లా టీడీపీలో గ్రూపుల తగాదాలు  కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూర్  పార్టీ  ఇంచార్జీ పదవిని  మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డికి కట్టబెట్టడం పట్ల పార్టీ నేత కన్నబాబు తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద  ఆయన నిరసన దీక్షకు దిగాడు. కన్నబాబు పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

నెల్లూరు జిల్లాలో  పార్టీని బలోపేతం చేసేందుకు గాను  ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఇంచార్జీలను నియమిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆత్మకూర్  అసెంబ్లీ నియోజకవర్గానికి  ఆదాల ప్రభాకర్ రెడ్డిని  ఇంచార్జీగా నియమించారు. దీంతో ఈ నియోజకవర్గ ఇంచార్జీ  పదవిపై ఆశలు పెట్టుకొన్న కన్నబాబు ఆశలు నీరుగారాయి.

ఆదాలప్రభాకర్ రెడ్డికి ఇంచార్జీ బాధ్యతలను కట్టబెట్టడంతో వచ్చే ఎన్నికల్లో తనకు పార్టీ టిక్కెట్టు దక్కదని కన్నబాబు భావిస్తున్నారు. ఆత్మకూర్ ఇంచార్జీగా  ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించడంతో అసంతృప్తికి గురైన కన్నబాబు  పార్టీ కార్యాలయంలోనే నిరహారదీక్షకు దిగారు.

అనుచరులతో పాటు కన్నబాబు పార్టీ కార్యాలయంలోనే నిరసన దీక్ష చేపట్టారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తులతో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కన్నబాబు పరోక్షంగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

ఇంచార్జీ పదవి దక్కకపోవడంతో కన్నబాబు పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది.  తనకు న్యాయం చేయాలని కన్నబాబు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. అయితే కన్నబాబు ఏ నిర్ణయం తీసుకొంటారనే విషయమై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

click me!