డాక్టర్లు తయారయ్యే హెల్త్ యూనివర్సిటీకి ఒక రౌడీ పేరా : జగన్‌పై కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం

Siva Kodati |  
Published : Sep 21, 2022, 03:02 PM IST
డాక్టర్లు తయారయ్యే హెల్త్ యూనివర్సిటీకి ఒక రౌడీ పేరా : జగన్‌పై కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం

సారాంశం

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చడాన్ని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు తప్పుబట్టారు. వర్సిటీ పెట్టేటప్పుడు వైఎస్ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. డాక్టర్లు తయారయ్యే హెల్త్ యూనివర్సిటీకి రౌడీ పేరు ఎలా పెడతారంటూ శ్రీనివాసులు మండిపడ్డారు.   

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. సీఎం జగన్ తీరుపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పందించారు. హెల్త్ యూనివర్సిటీ పెట్టినప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. లక్షల మంది డాక్టర్లను తయారు చేస్తున్న యూనివర్సిటీకి ఒక రౌడీ పేరు ఎలా పెడతారంటూ శ్రీనివాసులు భగ్గుమన్నారు. 

అంతకుముందు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.  వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. 

ALso Read:కూతురిని గిఫ్ట్ ఇస్తే వెన్నుపోటుతో ఎన్టీఆర్ కు రిటర్న్ గిఫ్ట్: ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై జగన్ సెటైర్లు

ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో తమ ప్రభుత్వం హయాంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టామని గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్ఆర్ తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చెయ్యలేదని అన్నారు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడం అర్థరహితమని అన్నారు. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్  ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతోందని విమర్శించారు. 

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం.. ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుందని ప్రశ్నించారు. కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్ళు ఇప్పుడు పేరు మార్చుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్‌కు ఏం సంబంధం ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. 
 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: పిఠాపురం లో పవన్ ఎంట్రీ చూసి బసవయ్య రియాక్షన్ చూడండి | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Visit Pithapuram Sankranti: సంక్రాంతి వేడుకల్లోడిప్యూటీ సీఎం | Asianet Telugu