జగన్ లేఖలాపి లెక్క చెప్పాలి.. మండిపడ్డ జవహర్

Published : Apr 10, 2021, 12:12 PM IST
జగన్ లేఖలాపి లెక్క చెప్పాలి.. మండిపడ్డ జవహర్

సారాంశం

జగన్ లేఖలు రాయడం ఆపి ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన వాటికి లెక్కలు చెప్పాలంటూ టీడీపీ నేత జవహర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద మండిపడ్డారు. 

జగన్ లేఖలు రాయడం ఆపి ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన వాటికి లెక్కలు చెప్పాలంటూ టీడీపీ నేత జవహర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద మండిపడ్డారు. 

మీ ప్రభుత్వంలో దళితులకు ఈ నవ రత్నాలెక్కడ దాచారో చెప్పగలరా? దళితులకు అందవలసిన సబ్ ప్లాన్ నిధులు దేనికి ఖర్చు పెట్టారు? మాదిగ కార్పోరేషన్ కు కేటాయించిన నిధులెన్ని? మాల, రెల్లి కార్పోరేషన్ కు ఏమిచ్చారు? అంటూ నిలదీశారు.

అంతేకాదు లిడ్ కాప్ స్ధలాలు ఏక్కడెక్కడ ఇళ్ళ స్ధలాల ఇచ్చారో వివరాలు చెప్పాలి? చర్మకారుల సంక్షేమం కోసం మీ ప్రభుత్వం తీసుకున్న వివరాలు చెప్పగలరా?
చెప్పులు కుట్టే వారికి మీరు అందిస్తున్న చేయూత ఏమయింది? అని ప్రశ్నించారు. 

టీకా ఉత్సవం : ప్రధాని మోదీకి జగన్‌ లేఖ.. ఏపీకి 25 లక్షల కోవిడ్‌ డోస్‌లు......

దళిత పిల్లల భవిష్యత్ మార్చే బెస్ట్ ఎవైలబుల్ స్కూలెక్కడ? అంబేద్కర్ విదేశి విద్య ఎక్కడ? అని సూటి ప్రశ్న వేశారు. 

యస్ సి కార్పోరేషన్ ద్వారా ఇచ్చిన లోన్లు ఎన్నో చెప్పగలరా?...పై వాటికి సమాధానం చెప్పి తరువాతే జగన్ తిరుపతి లో ఓట్లడగాలని డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు