మరదలితో వివాహేతర సంబంధం...టీడీపీ నేతకు జైలు శిక్ష

Published : Oct 23, 2019, 11:35 AM ISTUpdated : Oct 23, 2019, 01:53 PM IST
మరదలితో వివాహేతర సంబంధం...టీడీపీ నేతకు జైలు శిక్ష

సారాంశం

 వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ ధర్మవరం సీనియర్‌ సివిల్‌ జడ్జి క్రిష్ణవేణమ్మ తీర్పునిచ్చారు.  బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వరయ్య తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 

వివాహేతర సంబంధం కేసులో... టీడీపీ నేతకు చుక్కెదురైంది. పెళ్లై భర్త ఉన్న మరదలితో  ఓ టీడీపీ నేత వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసిన ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆ టీడీపీ నేతకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ ధర్మవరం సీనియర్‌ సివిల్‌ జడ్జి క్రిష్ణవేణమ్మ తీర్పునిచ్చారు.  బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వరయ్య తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 

Also Read దివాకర్ ట్రావెల్స్ పై కేసు నమోదు...10 బస్సులు సీజ్

ఈ విషయం తెలిసిన తర్వాత ఆమె భర్త శ్రీకాంత్‌ మనస్తాపానికి గురై కిరోసిన్‌ పోసుకొని నిప్పటించుకుని మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుని సోదరి పోలీసులను ఆశ్రయించింది. తన సోదరుడు చనిపోవడానికి టీడీపీ నేత ఈశ్వర్యయ్య కారణమని ఆమె ఆరోపించింది. తన అన్న భార్యతో ఈశ్వరయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని... అది తెలిసి తట్టుకోలేక తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నడాని ఆమె పేర్కొంది.

ఆమె ఫిర్యాదు మేరకు బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఈశ్వరయ్య, అతడి మరదలు రాధపై సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయిలు ఈశ్వరయ్య, రాధలకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం