చంద్రబాబు దెబ్బకి బీజేపీ విలవిలలాడుతోంది.. డొక్కా

Published : Nov 06, 2018, 03:09 PM IST
చంద్రబాబు దెబ్బకి బీజేపీ విలవిలలాడుతోంది.. డొక్కా

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహానికి బీజేపీ విలవిలలాడిపోతోందని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాదరావు అభిప్రాయపడ్డారు.

ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహానికి బీజేపీ విలవిలలాడిపోతోందని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాదరావు అభిప్రాయపడ్డారు. ఈ రోజు కర్ణాటకలో ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం సాధించింది. కాగా ఈ విషయంపై డొక్కా మీడియా సమావేశంలో మాట్లాడారు.

 కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీకి చావు దెబ్బతగిలిందని డొక్కా అభిప్రాయపడ్డారు. ఇదే సీను రేపు తెలంగాణ జరిగే ఎన్నికల ఫలితాల్లో రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  తెలుగువాడి దెబ్బేంటో ప్రధాని మోదీకి ఇప్పుడిప్పుడే తెలుస్తోందన్నారు.

టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ వి జాతీయ భావాలేనని, వాటినే ఇప్పుడు చంద్రబాబు కొనసాగిస్తున్నారని డొక్కా వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భూస్థాపితం కావడం తథ్యమని ఆయన అన్నారు. 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు