ఉద్యోగ సంఘాల నేతలకు వైసీసీ ఎమ్మెల్యే శ్రీనివాసులు వార్నింగ్

By Sumanth KanukulaFirst Published Jan 25, 2022, 3:21 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పీఆర్సీ జీవోలను (PRC GOs) రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారు సమ్మెకు కూడా సిద్దమయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలకు వైసీపీ ఎమ్మెల్యే  కొరముట్ల శ్రీనివాసులు (Koramutla Srinivasulu) వార్నింగ్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పీఆర్సీ జీవోలను (PRC GOs) రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారు సమ్మెకు కూడా సిద్దమయ్యారు. పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. సంప్రదింపుల కోసం ఏర్పాటైన ప్రభుత్వ కమిటీతో చర్చలు జరిపేందుకు ఉద్యోగులు నిరాకరిస్తున్నారు. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలకు వైసీపీ ఎమ్మెల్యే  కొరముట్ల శ్రీనివాసులు (Koramutla Srinivasulu) వార్నింగ్ ఇచ్చారు. వేల కోట్ల జీతాలు తీసుకుని ప్రభుత్వాన్ని బెదిరిస్తారా అని ఉద్యోగ సంఘాల నాయకులను ప్రశ్నించారు. 

ప్రభుత్వం  సంప్రదింపులకు కమిటీ ఏర్పాటు చేస్తే.. ఉద్యోగ సంఘాల నాయకులు చర్చలకు రాకపోవడం క్రమశిక్షణారాహిత్యమేనని చెప్పారు. ఉద్యోగ సంఘ నేతలు ప్రతిపక్షాల మాటలు విని విర్రవీగుతున్నారని ఆరోపించారు. పరిస్థితులు ఇలాగే ఉంటే జయలలిత, ఎన్టీఆర్ హయాంలోని పరిస్థితులు పునరావృతం తప్పదని అని శ్రీనివాసులు హెచ్చరించారు. 

ఇక, ఈ రోజు ఉదయం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy).. కరోనా సమయంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని తెలిపారు. కష్ట పరిస్థితుల్లో కూడా సీఎం జగన్ జీతాలు పెంచారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఉద్యోగులు గమనించాలని కోరారు. పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై పది కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే వారి ట్రాప్‌లో ఉద్యోగులు పడొద్దని కోరారు. అందరికీ మేలు చేయాలనే ఆలోచన వైఎస్ జగన్ ప్రభుత్వానిదని చెప్పారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అధికారులను తన ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం చేయలేదన్నారు. ప్రజలకు ఉపయోగపడాలని, వారికి దగ్గరగా ఉండాలనే ఆలోచనే చేశారని అన్నారు. సంక్షేమ పథకాలను కుల, మతాలకు అతీతంగా అందజేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా సీఎం జగన్ వెనకడుగు వేయలేదని అన్నారు.
 

click me!