వైసిపి సర్కార్ క్లియరెన్స్ సేల్... భారీ భూదోపిడీ కోసమే కేబినెట్ భేటీ : బోండా ఉమ సంచలనం

By Arun Kumar PFirst Published Jun 8, 2023, 5:11 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో భారీ భూదోపిడీ కోసమే ముఖ్యమంత్రి జగన్ మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసినట్లు టిడిపి నేత బోండా ఉమ ఆరోపించారు. 

మంగళగిరి : గత నాలుగేళ్లలో రాష్ట్రంలోని సహజ వనరులు, ప్రజా సంపద, ప్రభుత్వ ఆస్తులను దోచేసిన జగన్ రెడ్డి దొంగల ముఠా ఈ తొమ్మిది నెలల్లో అందినకాడికి దోచుకోవాలని చూస్తోందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే మరింత ఉత్సాహంతో జగన్ బ్యాచ్ రాష్ట్రాన్ని దోచేసేందుకు సిద్దమైనట్లు స్ఫష్టంగా తెలుస్తోందని అన్నారు. 

నిన్నటి కేబినెట్ బేటీలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల గురించి బోండా ఉమ స్పందించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అధికారంలో వుండే ఈ చివరి రోజుల్లో దొరికినంత దోచుకుని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోందన్నారు. రాష్ట్రంలోని భూములను క్లియరెన్స్ సేల్ కు పెట్టినట్లుగా కేబినెట్ నిర్ణయాలు వున్నాయన్నారు. పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ మాదికిగానే భూములను క్లియరెన్స్ సేల్ లో పెట్టి భారీ దోపిడీకి వైసిపి ప్రభుత్వం తెరలేపుతోందని ఉమ ఆందోళన వ్యక్తం చేసారు. 

తమ దోపిడీతో వైసిపి పాలకులు ఇప్పటికే రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఉమ అన్నారు.మిగిలిన ఈ తొమ్మిది నెలల్లో మరింత దోచుకోండి అనేలా కేబినెట్ నిర్ణయాలు వున్నాయన్నారు.ముఖ్యమంత్రి జగన్, మంత్రులు తీసుకున్న నిర్ణయాల్లో ఏ ఒక్కటి ప్రజలకు ఉపయోగపడేలా లేవని బోండా ఉమ అన్నారు. 

Read More  తక్కువ రేటుకి కరెంట్ ఇస్తామంటే.. ఎందుకు వద్దు, జగన్ కక్కుర్తి వల్లే పవర్ కట్‌లు : పయ్యావుల కేశవ్

మెన్నటివరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని... వై నాట్ 175 అని ప్రగల్బాలు పలికిన జగన్ లో భయం మొదలైందని స్ఫష్టంగా తెలుస్తోందన్నారు. నిన్న  కేబినెట్ సమావేశంలో మంత్రుల్ని బాబ్బాబు అని బతిమాలుకునే దుస్థితి వచ్చిందంటే వైసిపి పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుందని అన్నారు. తొమ్మిది నెలల్లో ఎన్నికల్లో పోటీకి సిద్దం కావాలని జగన్ వేడుకుంటున్నాడని బోండా ఉమ అన్నారు. 

రాష్ట్రంలోని సమస్యలు, రైతులు, యువత, మహిళలు, ఉద్యోగుల ఇబ్బందులు, కష్టాలు ఏవీ జగన్ కేబినెట్ కు కనిపించినట్లుగా లేవని ఉమ అన్నారు. మంత్రివర్గ సమావేశంలో మొత్తం 63 నిర్ణయాలు తీసుకుంటే అందులో 23నిర్ణయాలు భూములకు సంబంధించినవేనని... దీన్ని బట్టే భూములు కొట్టేయడంపైనే కేబినెట్ శ్రద్ధపెట్టినట్లుగా అర్థమవుతుందని అన్నారు. 22ఏ భూములతో పాటు ఇతర వివాదాల్లోని భూముల్ని తన పార్టీవారికి, తన వర్గానికి కట్టబెట్టేందుకు జగన్ ఉవ్విళ్లూరుతున్నాడని ఉమ ఆరోపించారు. ఇప్పటికే విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో రూ.40వేలకోట్ల విలువైన భూముల్నిమింగేశారని... అయినా వైసిపి నాయకులు భూదాహం తీరడంలేదని బోండా ఉమ అన్నారు. 

టీడీపీ ప్రభుత్వం వచ్చినవెంటనే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతినిర్ణయాన్ని సమీక్షిస్తుందని ఉమ తెలిపారు. ముఖ్యమంత్రిని, మంత్రుల్ని నమ్మి ముందుకెళ్లేవారందరికీ మొసళ్లపండగ ముందుంటుందని బోండా ఉమ హెచ్చరించారు. 

click me!