దద్దమ్మలు, ఆడవాళ్ల మంగళసూత్రాలు కొట్టేసేరకం మీరు: జగన్, విజయసాయిలపై అయ్యన్న ఫైర్

Arun Kumar P   | Asianet News
Published : Mar 23, 2021, 02:57 PM IST
దద్దమ్మలు, ఆడవాళ్ల మంగళసూత్రాలు కొట్టేసేరకం మీరు: జగన్, విజయసాయిలపై అయ్యన్న ఫైర్

సారాంశం

 కండీషనల్ బెయిల్ పై బయట తిరిగే మీరు కూడా,స్టే అంటూ మాట్లాడే వాళ్ళే... అంటూ సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలపై మాజీమంత్రి అయ్యన్న విరుచుకుపడ్డారు. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి విరుచుకుపడ్డారు. మద్య నిషేదం పేరుతో కేవలం జగన్ బ్రాండ్లనే రాష్ట్రంలో అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. ఇలాంటివారు పారదదర్శకత గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు అయ్యన్న. 

''లిక్కర్ డాన్, ఇసుక దొంగ అయిన జగన్ రెడ్డికి పారదర్శకత, రివర్స్ టెండరింగ్ లాంటి పదాలు సెట్ కావు సాయిరెడ్డి. 2 ఏళ్లలో సామాన్యుడికి ఇసుక అందివ్వలేని దద్దమ్మలు మీరు. మద్యపాన నిషేధం పేరుతో జగన్ బ్రాండ్లు అమ్ముతూ మహిళల మెడలో పుస్తెలు సైతం కొట్టేస్తున్న కేటుగాళ్ళు మీరు. మీది రివర్స్ టెండరింగ్ కాదు రివర్స్ దోపిడీ. నీ టెండర్లు దాని వెనుక ఉన్న దొంగ లెక్కలు బయటపెట్టి, మీరు మింగిన ప్రతి రూపాయి వడ్డీతో సహా  కక్కిస్తాం రాసి పెట్టుకో సాయిరెడ్డి'' అంటూ అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. 

read more   26న భారత్ బంద్... టీడీపీ సంపూర్ణ మద్ధతు: అచ్చెన్నాయుడు

''కోర్టు లో స్టే వచ్చింది అని గగ్గోలు పెడుతున్న వైకాపా నేతలకు చిన్న సూచన. రెడ్లతో చంద్రబాబు గారి పై ఎస్సి, ఎస్టీ కేసు పెట్టించాలనే తింగరి ఐడియా ఇచ్చిన అపరమేధావి ఏవడని జగన్ రెడ్డిని నిలదీయాలి'' అంటూ ఎద్దేవా చేశారు. 

''1000 కీలక పదవులు రెడ్లకు కట్టబెట్టినంత మాత్రాన ఎస్సి, ఎస్టీ కేసులు కూడా రెడ్లే పెడతామంటే చట్టాలు చూస్తూ ఊరుకోవుగా! కండీషనల్ బెయిల్ పై బయట తిరిగే మీరు కూడా,స్టే అంటూ మాట్లాడే వాళ్ళే. కండీషనల్ బెయిల్ రద్దు చేసి, విచారణ చేయమని, అడిగే దమ్ముందా వైఎస్ జగన్'' అంటూ అయ్యన్న సవాల్ విసిరారు. 
 

PREV
click me!

Recommended Stories

Minister Kolusu Parthasarathy serious on Bhumana Karunakar Reddy | TDP VS YCP | Asianet News Telugu
విజయవాడ సంక్రాంతి వేడుకల్లో MP Kesineni Sivanath | Sankranthi Muggulu | Asianet News Telugu