పరదాలు లేకుండా జగన్ బయటకు రాలేడు... ఐదుగురు రెడ్డి సామంతరాజులదే పెత్తనం: అయ్యన్నపాత్రుడు

By Siva KodatiFirst Published Dec 6, 2022, 3:04 PM IST
Highlights

పరదాలు లేకుండా బయటకు రాలేని సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారంటూ ప్రశ్నించారు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు. ఐదుగురు రెడ్లు సామంతరాజుల్లా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీ కులాలకు జగన్ చేసిందేమి లేదని దుయ్యబట్టారు. రోడ్లపై పరదాలు లేకుండా బయటకు వెళ్లలేని జగన్ ఎన్నికల్లో ఎలా గెలుస్తారని అయ్యన్న ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు రాజకీయ సమాధి కడతారని , రాసి పెట్టుకోవాలని ఆయన జోస్యం చెప్పారు. జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జనం బాధపడుతున్నారని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎం అయితేనే బీసీలకు మళ్లీ పూర్వవైభవం వస్తుందని... ఐదుగురు రెడ్లు సామంతరాజుల్లా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 

అంతకుముందు గత ఆదివారం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... జగన్ పాలనలో ఏపీలోని బీసీలంతా మాకు ఇదేం ఖర్మ అని అంటున్నారని దుయ్యబట్టారు. బీసీలను మరోసారి మోసం చేసేందుకు సభ పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీసీల కోసం గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన జయహో బీసీ, బీసీ గర్జన వంటి నినాదాలను కూడా కాపీ కొట్టారని యనమల ఆరోపించారు. కానీ టీడీపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను మాత్రం ఆపేశారని, బీసీలను జగన్ ముంచేశారని ఆయన దుయ్యబట్టారు. బీసీలకు తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా అండగా నిలిచిందని రామకృష్ణుడు గుర్తుచేశారు. మూడున్నరేళ్ల పాలనలో బీసీలకు జగన్ చేసేందేమీ లేదని.. అంకెల గారడీతో ఏదేదో చేశామని మధ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అధికారాలు వున్న పదవులను సొంత వారికి అప్పగిస్తూ.. ప్రాధాన్యత లేని పదవుల్లో బీసీలను నియమిస్తున్నారని దుయ్యబట్టారు. 

Also REad:బీసీలకు అన్నింట్లో మోసం.. చివరికి నినాదాలు కూడా కాపీయేనా : జగన్‌పై యనమల వ్యాఖ్యలు

ఇకపోతే.. డిసెంబరు 7న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 'జయహో బీసీ మహా సభ' నిర్వహించనున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. బీసీ మహాసభ పోస్టర్లను గురువారం ఆయన బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బుడ్డి ముత్యాలనాయుడు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, మార్గాని బారత్, జంగా కృష్ణమూర్తి తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఉదయం 8 గంటలకు సభ ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మధ్యాహ్నం 12 గంటలకు కీలక ప్రసంగం చేయనున్నార‌ని పేర్కొన్నారు. 

click me!