(వీడియో) గిద్దలూరు మాజీ ఎంఎల్ఏ టిడిపికి రాజీనామా

Published : Aug 04, 2017, 03:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
(వీడియో) గిద్దలూరు మాజీ ఎంఎల్ఏ టిడిపికి రాజీనామా

సారాంశం

వైసీపీ నుండి గెలిచిన అశోక్ రెడ్డిని చంద్రబాబునాయుడు టిడిపికి లాక్కోవటంతో రాంబాబుకు సమస్యలు మొదలయ్యాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను రాంబాబే పర్యవేక్షించేవారు. ఎప్పుడైతే అశోక్ రెడ్డి టిడిపిలోకి ఫిరాయించారో అప్పటి నుండి రాంబాబుకు ఇబ్బందులు తప్పలేదు  ఇద్దరి మధ్యా ఆధిపత్య పోరాటాలు తారస్ధాయికి చేరుకున్నాయి. చంద్రబాబు కూడా రాంబాబును పట్టించుకోవటం మానేసారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎంఎల్ఏ అన్నా రాంబాబు టిడిపికి రాజీనామా చేసారు. పార్టీలోని అంతర్గత సమస్యలతో ఇమడలేక పార్టీని వీడుతున్నట్లు రాంబాబు శుక్రవారం ప్రకటించారు. ఈరోజు ఉదయం కార్యకర్తల సమావేశంలో అన్నా మాట్లాడుతూ, తనను పార్టీ నేతలు తీరని అవమానాలకు గురిచేసినట్లు ఆరోపించారు. అన్నీ రకాలుగా నష్టపోతున్న తాను పార్టీలో ఉండలేకే టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పటం గమనార్హం.

వైసీపీ నుండి గెలిచిన అశోక్ రెడ్డిని చంద్రబాబునాయుడు టిడిపికి లాక్కోవటంతో రాంబాబుకు సమస్యలు మొదలయ్యాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను రాంబాబే పర్యవేక్షించేవారు. ఎప్పుడైతే అశోక్ రెడ్డి టిడిపిలోకి ఫిరాయించారో అప్పటి నుండి రాంబాబుకు సమస్యలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్యా ఆధిపత్య పోరాటాలు తారస్ధాయికి చేరుకున్నాయి. చంద్రబాబు కూడా రాంబాబును పట్టించుకోవటం మానేసారు. దాంతో వేరేదారి లేక ఈరోజు పార్టీకి రాజీనామా చేసారు.

అయితే, ఏ పార్టీలో చేరేదీ మాత్రం చెప్పలేదు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అరాచకాలను నియోజకవర్గంలో ప్రచారం చేస్తానని చెప్పటం విశేషం. తన పర్యటన వచ్చే మార్చి వరకూ ఉంటుందట. జిల్లాలో గిద్దలూరే కాకుండా కందుకూరు, అద్దంకి, యర్రగొండుపాలెం నియోజకవర్గాల్లో కూడా ఫిరాయింపు ఎంఎల్ఏలకు, టిడిపి సీనియర్లకు మధ్య బాహాటంగానే ఆధిపత్య పోరాటాలు జరుగుతున్నాయి. చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు సర్దుబాటు చేద్దామని ప్రయత్నించినా సాధ్యంకాక వదిలేసారు. ఇటువంటి పరిస్ధితిలోనే అన్నా రాంబాబు టిడిపిని వదిలేసారు. ఇక, మిగలిన నియోజకవర్గాల్లోని సీనియర్ల పరిస్ధితి కూడా దాదాపు అంతే.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్