సంక్రాంతికి టీడీపీ ఫస్ట్ లిస్ట్..!?

By SumaBala Bukka  |  First Published Jan 5, 2024, 10:53 AM IST

గెలుపు ఛాన్స్ ఉన్న అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసే యోచనలో టీడీపీ ఉందట. ఈ క్రమంలో ఫస్ట్ లిస్టులోనే కొంతమంది సిటింగ్ ఎమ్మెల్యేల పేర్లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. 


అమరావతి : ఏపీలో పొలిటికల్ హీట్ నెమ్మదిగా పెరుగుతోంది. ఓ వైపు అధికార వైసీపీ ఇంఛార్జుల మార్పుతో ఇప్పటికే రెండు లిస్టులు విడుదల చేసింది. మరోవైపు జనసేనతో పొత్తుపెట్టుకున్న టీడీపీ లిస్టు విషయంలో ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలో సంక్రాంతికి టీడీపీ ఫస్ట్ లిస్ట్ రానున్నట్టు సమాచారం.

గతంలోనే లిస్టు విడుదల చేయనున్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు అనౌన్స్ చేశారు. కానీ పొత్తులు, సీట్ల సర్దుబాటుతో లిస్టు ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు 70 నుంచి 80 స్థానాలకు అభ్యర్థుల జాబితాను చంద్రబాబు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. 

Latest Videos

విజయవాడ లోక్ సభ స్థానం కేశినేని చిన్నికే..! కేశినేని నానీకి నో చెప్పిన హైకమాండ్.. !

జనసేనతో పొత్తు, పార్టీలో తెలుగుతమ్ముళ్ల మధ్య పోరు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలో కేశినేని నాని, కేశినేని చిన్నిల మధ్య తిరువూరులో జరిగిన గొడవలను సీరియస్ గా తీసుకున్నారు. కేశినేని నానీని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఈ సారి ఎంపీ టికెట్ నానీకి లేదని తేల్చేశారు. అలా ఓవైపు పార్టీలో అంతర్గత పోరును వ్యూహాత్మకంగా పరిష్కరిస్తూనే.. మరింత దూకుడుగా ఎన్నికల కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారట. 

ఈ క్రమంలోనే నేటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ సంక్రాంతికి మొదటి లిస్ట్ విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ముందుగా అసెంబ్లీకి అభ్యర్థుల ప్రకటన ఉండే ఛాన్స్ ఉందట. ఫస్ట్ లిస్టులో సీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర స్థానాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. గెలుపు ఛాన్స్ ఉన్న అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసే యోచనలో టీడీపీ ఉందట. ఈ క్రమంలో ఫస్ట్ లిస్టులోనే కొంతమంది సిటింగ్ ఎమ్మెల్యేల పేర్లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. 

మరోవైపు గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ 25సీట్లు డిమాండ్ చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల సమాచారం. 2009లో ప్రజారాజ్యం గెలుపొందిన సీట్లపై పవన్ దృష్టి పెడుతున్నారని ఈ క్రమంలోనే ఆయా సీట్ల కోసం పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సీట్లతో పాటు మరికొన్ని సీట్లు అడుగుతున్న పవన్ కల్యాణ్ అడుగుతున్నారట. కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువున్న స్థానాల కోసం పవన్ పట్టుబడుతున్నారట.

ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని టీడీపీ తమ ఫస్ట్ లిస్టును సంక్రాంతికి విడుదల చేయనుందట. పవన్ కల్యాణ్ అడుగుతున్న స్థానాలన్నీ జనసేనకు కేటాయిస్తే ఏం జరుగుతుంది? పవన్‌ కల్యాణ్ డిమాండ్‌కు చంద్రబాబు దిగి వస్తారా..? తొలి జాబితాలో చోటెవరికి దక్కుతుంది? అనే సందేహాలు తెలుగు తమ్ముళ్లలో ఉన్నాయట. ఈ క్రమంలోనే ఫస్ట్ లిస్టులో ఎవరెవరు పేర్లు ఉంటాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. దీనిమీద పూర్తి క్లారిటీ రావాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. 

click me!