చంద్రబాబు దెబ్బ దెబ్బకు రాటు దేలుతారు, ఇవేమీ కొత్తకాదు : ప్రత్తిపాటి

Published : Jun 21, 2019, 07:41 PM ISTUpdated : Jun 21, 2019, 07:42 PM IST
చంద్రబాబు దెబ్బ దెబ్బకు రాటు దేలుతారు, ఇవేమీ కొత్తకాదు : ప్రత్తిపాటి

సారాంశం

చంద్రబాబును ఉండవల్లి నుంచి వెళ్లగొట్టడం ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు. ఎన్ని దెబ్బలు పడితే అంత రాటుదేలుతారని, చంద్రబాబుకు ఈ ఆటుపోటులు కొత్తేమీ కాదన్నారు బుద్దా వెంకన్న. చంద్రబాబుకు జరుగుతున్న అన్యాయం ప్రజలంతా చూస్తున్నారని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.  

ఉండవల్లి: ప్రజావేదికను ఆంధప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. వైసీపీ ప్రభుత్వం కనీస సాంప్రదాయాలను కూడా పాటించడం లేదని మండిపడ్డారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. 

ప్రతిపక్ష నేత విదేశాల్లో ఉన్నప్పుడు ప్రజావేదికను ఎలా స్వాధీనం చేసుకుంటారని మండిపడ్డారు. ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు నిలదీశారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజావేదిక అక్రమ కట్టడం అంటూ పదేపదే ఆరోపించిందని, శాసన మండలిలో వైసీపీ ఫ్లోర్ లీడర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూల్చివేస్తామని చెప్పారని అలా చేయకుండా స్వాధీనం చేసుకోవడం చీప్ పాలిట్రిక్స్ కు నిదర్శనమన్నారు.  

వైసీపీ ప్రభుత్వం ప్రజావేదికను స్వాధీనం చేసుకునే విధానం చూస్తుంటే రౌడీ రాజ్యాన్ని తలపిస్తోందని మరో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. తమ అధినేత విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఇలా చేయడం సరికాదన్నారు. 

ప్రజావేదిక భవనానికి సంబంధించి చంద్రబాబు లేఖ రాశారని, దానికి ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే వైసీపీ దౌర్జన్యం కనిపిస్తోందన్నారు. చంద్రబాబును రాష్ట్రం నుంచి ఎలాగైనా వెళ్లగొట్టాలని, బలహీనపరచాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబును ఉండవల్లి నుంచి వెళ్లగొట్టడం ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు. ఎన్ని దెబ్బలు పడితే అంత రాటుదేలుతారని, చంద్రబాబుకు ఈ ఆటుపోటులు కొత్తేమీ కాదన్నారు బుద్దా వెంకన్న. చంద్రబాబుకు జరుగుతున్న అన్యాయం ప్రజలంతా చూస్తున్నారని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాము దౌర్జన్యాలకు వెళ్లదలచుకోలేదని చట్టపరంగా పరిష్కరించుకుంటామని తేల్చిచెప్పారు బుద్దా వెంకన్న. 

ఈ వార్తలు కూడా చదవండి

అప్పుడు అక్రమ కట్టడమని ఇప్పుడు స్వాధీనమా? : ప్రజావేదిక పై పంచుమర్తి అనురాధ

చంద్రబాబుకు షాక్: ప్రజావేదికను స్వాధీనం చేసుకున్న జగన్ సర్కార్

PREV
click me!

Recommended Stories

Kakinada : గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా కాకినాడ.. చంద్రబాబు, పవన్ స్కెచ్ మామూలుగా లేదుగా !
YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu