ఏపీలో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు: సుప్రీంలో టీడీపీ పిటిషన్

By narsimha lode  |  First Published Mar 5, 2020, 3:08 PM IST

 ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై టీడీపీ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను గురువారం నాడు దాఖలు చేసింది.



న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై టీడీపీ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను గురువారం నాడు దాఖలు చేసింది. పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ కె రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప,కొనకళ్ల నారాయణ,పల్లా శ్రీనివాసరావు,ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల తగ్గింపును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

బీసీ రిజర్వేషన్ల కుదింపు నిర్ణయం ఏపీ సీఎం జగన్ కనుసన్నల్లోనే జరిగిందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది.వైఎస్ఆర్సిపి సంబంధిత వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు హైకోర్టులో సుప్రీంకోర్టులోనూ బీసీ రిజర్వేషన్లు తగ్గించే ప్రయత్నం చేశారని టీడీపీ విమర్శిస్తోంది. 

Latest Videos

undefined

జగన్ అధికారంలోకి రావడానికి బీసీలు సహకరిస్తే వారి రిజర్వేషన్లనే జగన్ కుదిస్తున్నాడని టీడీపీ చెబుతోంది. బీసీ రిజర్వేషన్లు తగ్గడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మంది బీసీ నాయకులు సంఖ్య తగ్గిపోతుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పారు. 

సొంత కేసులకు కోట్ల రూపాయల న్యాయవాదులు పెట్టుకునే జగన్ బీసీల కేసులో ఎందుకు సమర్ధుడైన లాయర్ ను నియమించలేదని ఆయన ప్రశ్నించారు. 
గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 176 ను యధాతథంగా అమలు చేయాలని  ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

click me!