వైసీపీ వైపు మరో మాజీ ఎమ్మెల్యే... చంద్రబాబుకి మరో షాక్

By telugu teamFirst Published Dec 4, 2019, 1:09 PM IST
Highlights

తెంటును ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించేది లేదని శంబంగి వర్గానికి చెందిన వారు కరాఖండిగా చెబుతున్నారు. జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం తెంటు పట్ల సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఏపీ లో రాజకీయాలు రోజు రోజుకీ ఆసక్తిగా మారుతున్నాయి. కీలక నేతల చూపంతా వైసీపీ వైపే కనపడుతోంది. ఇప్పటికే పలువురు జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోగా...తాజాగా... మరికొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు.  తాజాగా.. బొబ్బిలి నియోజకవర్గ  టీడీపీ ఇంఛార్జి తెర్లాం మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆయన త్వరలోనే టీడీపీని వీడి.... వైసీపీలో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనుండగా... పార్టీ మార్పులు విజయనగరం జిల్లాలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.ప్రస్తుతమైతే స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, తెంటు లక్ష్మునాయుడు మధ్య సత్సంబంధాలు లేవు.

AlsoRead చంద్రబాబుకు షాక్: వైసీపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు, వారు వీరే......
 
తెంటును ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించేది లేదని శంబంగి వర్గానికి చెందిన వారు కరాఖండిగా చెబుతున్నారు. జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం తెంటు పట్ల సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో ఏదైనా కీలకమైన పదవి లభించకపోయినా భవిష్యత్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెర్లాం సీటు తనకు పదిలమవుతుందని తెంటు యోచిస్తున్నట్లు తెలిసింది. 

వైసీపీ నుంచి పూర్తిస్థాయిలో ఆహ్వానం వచ్చినట్లయితే నియోజకవర్గంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలతో సమావేశమై చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటానని తెంటు చెబుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తెంటుతో పాటు బొబ్బిలి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆర్‌విఎస్‌కెకె రంగారావు (బేబీనాయన) కూడా వైసీపీలోకి వెళతారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీనిపై కొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.

click me!