జనసేన - బీజేపీలకు ప్రచారం చేస్తా: చింతమనేని సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 03, 2021, 02:47 PM IST
జనసేన - బీజేపీలకు ప్రచారం చేస్తా: చింతమనేని సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 23వ డివిజన్‌లో టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధి నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

తెలుగుదేశం తరపున విత్ డ్రా చేసుకున్న వారిని వదిలేది లేదని ఆ స్థానాల్లో జనసేన, బీజేపీ తరపున ప్రచారం చేస్తానని ప్రభాకర్ స్పష్టం చేశారు. పార్టీని అమ్ముకున్న వారికి భవిష్యత్ వుండదని, నమ్ముకున్న వారికి మాత్రం తాను అండగా వుంటానని తెలిపారు. చింతమనేని వ్యాఖ్యలతో ఏలూరు రాజకీయ హీటెక్కింది. 

కాగా, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్లో టీడీపీకి దిశా నిర్దేశం చేసే నాయకుడే కరవయ్యాడు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జి పార్టీని లీడ్‌ చేసి 50 డివిజన్లలో 42 చోట్ల గెలిపించడంతో కార్పొరేషన్‌ను టీడీపీ కైవసం చేసుకుంది.

ఆయన చనిపోవడంతో బుజ్జి తమ్ముడు బడేటి చంటికి కార్పొరేషన్‌ బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. కానీ‌ చంటి పార్టీని బలోపేతం చేయడంలో వెనుకబడ్డారు.

ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని మంత్రి కూడా కావడంతో ఏలూరు వైసీపీలో బలమైన లీడర్లతో పాటు కేడర్ కూడా ఉంది. కానీ..టీడీపీని లీడ్ చేసేవాళ్లు లేక ఆ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!