అసెంబ్లీలో ఛాంబర్ల కేటాయింపుపై టీడీపీ నిరసన

By Siva KodatiFirst Published Jun 12, 2019, 5:01 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఛాంబర్ల కేటాయింపు విషయంలో తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపక్షనేతకు, పార్టీకి ఏ ఛాంబర్లే ఇస్తారనే అంశంపై కొందరు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఛాంబర్ల కేటాయింపు విషయంలో తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపక్షనేతకు, పార్టీకి ఏ ఛాంబర్లే ఇస్తారనే అంశంపై కొందరు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

గతంలో ప్రతిపక్షపార్టీకి ఇచ్చిన కార్యాలయాలు, టీడీపీకి ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా లేదనే ప్రచారం అసెంబ్లీ ఆవరణలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబుకు 130వ నెంబర్ గదిని కేటాయించడంపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం తెలిపినట్లుగా తెలుస్తోంది.

గతంలో సీఎం ఛాంబర్, ప్రధాన పక్ష ఆఫీస్‌ను కూడా వైసీపీ  దగ్గర పెట్టుకోవడంపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఎల్పీ కార్యాలయం, ఇతర సదుపాయాల విషయంపై స్పీకర్ ఎన్నిక తర్వాత ఛాంబర్లు, కార్యాలయాల ఏర్పాటుపై వినతిపత్రం ఇచ్చే అవకాశాన్ని  టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు.

నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన ఆఫీసులు తమకు ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు. 

click me!