ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు కూడా టీడీపీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
నెల్లూరు: ఉమ్మడి Nellore జిల్లా Atmakur Bypoll ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని TDP నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి Mekapati Gautham Reddy ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో YCP తరపున మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు బరిలో దిగనున్నారు.దీంతో ఈ ఉప ఎన్నికకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని టీడీపీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
also read:Atmakur Bypoll: ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. టీడీపీ బరిలో నిలుస్తుందా..?
undefined
ఈ ఏడాది ఫిబ్రవరి 22న మేకపాటి గౌతం రెడ్డి హైద్రాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. మేకపాటి గౌతం రెడ్డి కుటుం బసభ్యులు కూడా విక్రంరెడ్డిని ఈ స్థానం నుండి పోటీకి నిలపాలనే విషయమై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు.దీంతో మేకపాటి గౌతం రెడ్డి మరణంతో ఆయన సోదరుడు మేకపాటి విక్రంరెడ్డిని ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బరిలోకి దింపాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. దీంతో టీడీపీ ఈ స్థానంలో పోటీకి దూరంగా ఉండాలనే అభిప్రాయంతో ఉంది.
2021 లో జరిగిన Badvel అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంది. ఈ స్థానానికి అందరి కంటే ముందుగానే టీడీపీ తన అభ్యర్ధిని ప్రకటించింది. అయితే బద్వేల్ స్థానం నుండి వైసీపీ ఎమ్మెల్యే Venkata Subbaiah అనారోగ్యంతో మరణించాడు. దీంతో వెంకట సుబ్బయ్య భార్యకు వైసీపీ టికెట్ కేటాయించింది. దీంతో పోటీకి దూరంగా ఉండాలని వైసీపీ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలను కోరింది. దీంతో పోటీ నుండి తప్పుకోవాలని టీడీపీ అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత కూడా ఈ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకొంది టీడీపీ. సంప్రదాయాలకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నామని టీడీపీ వివరించింది.
ఈ నెల 28వ తేదీన మాజీ మంత్రి Anam Ramanarayana Reddy కూతురు కైవల్యారెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. ఆమె ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించినట్టుగా ప్రచారం కూడా సాగింది. ఈ విషయమై టీడీపీ అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ఈ ఏడాది జూన్ 23న పోలింగ్ జరగనుంది. జూన్ 29న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ నిన్ననే విడుదలైంది. జూన్ 6వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.
జూన్ 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నెల 30న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో నామినేషన్ల కోలాహలం మొదలైంది. నిన్న రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా రమేష్ నవతరం పార్టీ తరపున రావు సుబ్రహ్మణ్యం నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీతో పాటు, కాంగ్రెస్ పార్టీ కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి చేవూరు శ్రీధర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. బీజేపీ అభ్యర్థిత్వంపై ఇంకా స్ఫష్టత రాలేదు.