తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ చంద్రబాబు నివాసం వద్ద నిరసనకు జోగి రమేష్ ప్రయత్నించిన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.
గుంటూరు: తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ నేతలు శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ చంద్రబాబునాయుడు నివాసాన్ని వైసీపీ కార్యకర్తలు జోగి రమేష్ నేతృత్వంలో ముట్టడించారు.
చంద్రబాబునాయుడు నివాసం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకొన్నాయి. టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడిలో ఎమ్మెల్యే జోగి రమేష్ కారు ధ్వంసమైంది. తనపై కూడ టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు.
also read:నీ సరదాను మేమెందుకు కాదంటాం? వడ్డీతో సహా వడ్డిస్తాం: జగన్ కు లోకేష్ వార్నింగ్
ఇరువర్గాల తోపులాటలో టీడీపీ నేత బుద్దా వెంకన్న సొమ్మసిల్లి పడిపోయాడు.ఈ విషయమై టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో జోగి రమేష్ కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. తమపై జోగి రమేష్ సహా వైసీపీ నేతలు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.