జగన్మోహన్ రెడ్డి అండతోనే టిడిపి నేతల హత్యలు: చంద్రబాబు ఆగ్రహం

By Arun Kumar P  |  First Published Jan 4, 2021, 9:58 AM IST

పొద్దుటూరులో నందం సుబ్బయ్య హత్య, దాచేపల్లిలో అంకులు హత్య వైసిపి హత్యా రాజకీయాలకు నిదర్శనాలని టిడిపి జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 


గుంటూరు: గురజాల నియోజకవర్గం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి అంకులును కిరాతకంగా హత్య చేయడంపై టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి హత్యా రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

''20ఏళ్లు సర్పంచిగా పనిచేసిన అంకులును హత్య చేయడం కిరాతక చర్య. గత 19నెలల్లో 16మంది టిడిపి కార్యకర్తలను మట్టుబెట్టారు. పొద్దుటూరులో నందం సుబ్బయ్య హత్య, దాచేపల్లిలో అంకులు హత్య వైసిపి హత్యా రాజకీయాలకు నిదర్శనాలు'' అన్నారు.

Latest Videos

''వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హత్యాకాండ పేట్రేగి పోయింది. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. శాంతి భద్రతలను అధ:పాతాళానికి దిగజార్చారు. మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు హంతకులను కఠినంగా శిక్షించాలి. వైసిపి హత్యారాజకీయాలను ప్రజాస్వామ్య వాదులంతా గర్హించాలి'' అని చంద్రబాబు పేర్కొన్నారు. 

read more  కత్తిని నమ్ముకున్న వాడు అదే కత్తికి బలైపోతాడు: టిడిపి నేత హత్యపై లోకేష్

కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురైన ఘటన మరవకముందే గుంటూరు జిల్లాలో అదే పార్టీకి చెందిన నేత హత్యకు గురయ్యాడు. దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్‌లో తెలుగుదేశం పార్టీ నేతను ప్రత్యర్ధులు హతమార్చారు. ఆయనను పెదగార్లపాడు కు చెందిన పురంశెట్టి‌ అంకుల్‌గా గుర్తించారు.

పెదగార్లపాడు గ్రామంలో టీడీపీనేతగా వున్న అంకులు.. సర్పంచిగా పదిహేను సంవత్సరాలు సేవలందించారు. గతంలో కూడా అంకుల్‌ను పంచాయతీకి పిలిచి ప్రత్యర్థులు గొంతు కోశారు. కానీ ఈసారి ఏకంతా అతన్ని హతమార్చారు.

click me!