వైసీపీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టకు నష్టం జరిగింది: కేంద్ర మంత్రి షేకావత్‌కు చంద్రబాబు లేఖ

By Sumanth KanukulaFirst Published Jun 29, 2022, 4:54 PM IST
Highlights

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం గురించి చంద్రబాబు  ప్రస్తావించారు. 

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం గురించి చంద్రబాబు  ప్రస్తావించారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుందని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుంతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్​ను సత్వరం పూర్తి చేయడానికి సహకరించాలని కేంద్రాన్ని కోరారు. 

ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరు తలచుకుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పనులను మరో ఏజెన్సీకి అప్పగించారని.. ఆకస్మికంగా పనుల నిలిపివేతతో కొత్త ఏజెన్సీ పనులు ప్రారంభించేందుకు ఆరు నెలల సమయం పట్టిందని లేఖలో పేర్కొన్నారు. పనులు చేపట్టకపోవడంతో డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నారు. పోలవరంపై కేంద్రం, పీపీఏ రాష్ట్రానికి చేసిన సూచనలు, హెచ్చరికలను ప్రభుత్వం ఎలా పెడచెవిన పెట్టిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 

click me!