మూడు రాజధానులు పేరుతో ప్రజలను ముప్పతిప్పలు పెడతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. పిచ్చి తుగ్లక్ పాలన అంటే ఇలానే ఉంటుందని, ఒక పని కోసం ఎమ్మెల్యే లు అమరావతి నుంచి విశాఖ వెళతారాని ఆయన ప్రశ్నించారు
ఉండవల్లిలో వైసీపీ ప్రభుత్వం కూలగొట్టిన ప్రజావేదిక ప్రాంతాన్ని టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావేదిక నిర్మాణానికి 7 కోట్ల 43 లక్షలు ఖర్చయిందని, ప్రజావేదికను జూన్ 25 రాత్రి కూల్చివేశారని గుర్తుచేశారు. రాజధాని ఏరియాలో సమావేశం నిర్వహించడానికి సరైన హాలు లేదని.. పద్దతి ప్రకారం ప్రజా వేదిక తొలగించి ఉంటే ఐదు కోట్లు ఆదా అయ్యేవని బాబు వెల్లడించారు.
నేటి వరకు ఈ ప్రజా వేదికను నిరుపయోగంగా మార్చారని.. అమరావతి అంటే వైసీపీ ప్రభుత్వానికి ఎందుకంత కోపమని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతి, ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ప్రచారం చేస్తున్నారని.. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారని టీడీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు లావాదేవీలు చేసిన టిడిపి నేతలకు అంటగట్టడం దుర్మార్గమని, జగన్ లాగా అందరూ తప్పుడు లెక్క లతో దోచుకున్నారని భావిస్తున్నారని బాబు ఎద్దేవా చేశారు.
undefined
Also Read:మూడు రాజధానులకు బీజేపీ ఓకే.. కానీ ఆ ఒక్కటి కష్టం: కన్నా
అసత్యాలు ప్రచారం చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారని, అమరావతిని ఏదో విధంగా చంపాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సింగపూర్ నుంచి ప్రభుత్వ కంపెనీలు వస్తే దుష్ప్రచారం చేశారని... దేశంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ లో ఉపాధి కోసం వస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. రాజధాని లో అన్ని వర్గాల వారు ఉన్నా.. ఒకే సామాజిక వర్గం అంటూ ప్రచారం చేశారని బాబు మండిపడ్డారు.
రాష్ట్రం లో పరిశ్రమలు అన్నీ వెనక్కి వెళ్లిపోయాయని... రాజధాని ముంపు ప్రాంతంలో ఉందని మరో ప్రచారం చేశారని టీడీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వం తీరును తప్పు బట్టారని, వనరులు ఉపయోగించి సంపద సృష్టించాలని మేము చూశామని ఆయన స్పష్టం చేశారు. గత యేడాది కంటే ఈ యేడాది ఆదాయం, ఖర్చు తగ్గాయని, ఆరోగ్య శ్రీ, పాఠశాలలు నాడు-నేడు అంటున్నారని బాబు ఎద్దేవా చేశారు.
చివరికి మీడియా గొంతు కూడా నొక్కేశారని, మూడు ఛానళ్లను అసలు అసెంబ్లీ సమావేశాలకు రానివ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. ఒక్కోచోట ఒక్కో కేంద్రం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అంటారని, మూడు రాజధానులు పేరుతో ప్రజలను ముప్పతిప్పలు పెడతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. పిచ్చి తుగ్లక్ పాలన అంటే ఇలానే ఉంటుందని, ఒక పని కోసం ఎమ్మెల్యే లు అమరావతి నుంచి విశాఖ వెళతారాని ఆయన ప్రశ్నించారు.
జగన్ తీరువల్ల రాష్ట్రం అన్నివిధాలా వెనక్కి పోతుందని, హైదరాబాదు లో జగన్ ఆస్తుల విలువ పెంచుకోవాని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఒక్ల రూపాయి అవసరం లేకుండా రెండు లక్షల కోట్లు ఆదాయం ఇస్తామని చెప్పామని, గతంలో హైదరాబాదు లో స్థలం విలువ ఇప్పుడెంత అని బాబు గుర్తుచేశారు. వితండవాదం, మూర్ఖత్వం తో జగన్ ముందుకు పోతున్నారని, మమ్మలను సస్పెండ్ చేసి ఏం సాధించారని ఆయన నిలదీశారు.
కనీస అవగాహన లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని, అధికార వికేంద్రీకరణ అంటే పరిశ్రమలు తేవాలి, ఉద్యోగం కల్పించాలని సూచించారు. మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాలకు తిరగడం సాధ్యమా అని చంద్రబాబు ప్రశ్నించారు. కర్నూలు లో బెంచ్ పెట్టాలని మేము భావించామని, జగన్ అసలు ఏంచేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. మంత్రులను ఇక్కడ పెడతాడా.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లో పెడతాడా అని ఆయన ప్రశ్నించారు.
బినామీలు అంటున్న జగన్...నిజంగా ఉంటే చర్యలు తీసుకోవాలని, ఆయనలా బినామీలను పెట్టుకుని దోచుకునే ఖర్మ తమకు లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుందో కాలమే చెప్పాలన్నారు. విశాఖ లో వైసిపి నేతలు భూములు కొన్నారని చెబుతున్నారని, కమిటీ రిపోర్ట్ రాకముందే రాజధాని విషయం జగన్ ఎలా ప్రకటిస్తారని చంద్రబాబు నిలదీశారు.
Also Read:ఏపీకి మూడు రాజధానులు వచ్చే ఛాన్స్: అసెంబ్లీలో జగన్
జగన్ పెద్ద బఫూన్ అని అందుకే ప్రజలకు నష్టం కలిగే చర్యలు తీసుకుంటున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎపి లో యువత జీవితాలు చాలా ప్రమాదకరంగా మారతాయని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఏడు రోజులు ఏడు సబ్జెక్టు ల పై చర్చ పెట్టామని.. తాము అనని మాటలను అన్నట్లుగా చెప్పి చర్చ పెట్టారని టీడీపీ చీఫ్ మండిపడ్డారు. పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమౌతుందో అన్న విధంగా రాష్ట్రం ఉందని, కొత్త రాష్ట్రం, కొత్త రాజధానిలో నిలదొక్కుకోవాలని తాము ప్రయత్నం చేశామని గుర్తుచేశారు.
జగన్ వచ్చాక అన్ని వ్యవస్థ లను నీరుగార్చారని, అన్ని జిల్లాల్లో జిల్లాకో ప్రధాన కార్యాలయం పెట్టినా అశ్చర్యం ఆక్కర్లేదని చంద్రబాబు జోస్యం చెప్పారు. దీని వల్ల ప్రజల మధ్య విద్వేషాలు, డిమాండ్ లు పెరిగే ప్రమాదం ఉందని, కాబట్టి జనం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఆలోచన చేయాలని ప్రతిపక్షనేత సూచించారు. నాలుగు లక్షల మంది తన వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, వారందరికీ జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ తీరు పై మా పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు.