సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు .. పూచీకత్తు సమర్పించిన టీడీపీ చీఫ్

Siva Kodati |  
Published : Jan 13, 2024, 03:48 PM ISTUpdated : Jan 13, 2024, 03:53 PM IST
సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు .. పూచీకత్తు సమర్పించిన టీడీపీ చీఫ్

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం , ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఇటీవల ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం , ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఇటీవల ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సీఐడీకి పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్ట్ ఆదేశాల మేరకు సీఐడీ అధికారులకు పూచీకత్తు, బాండ్ పేపర్లను చంద్రబాబు నాయుడు సమర్పించారు. 

కాగా..  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం , ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఇటీవల ఏపీ హైకోర్టు ఒకేసారి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టీ మల్లిఖార్జున రావు ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని, వారం లోపు రూ.లక్ష చొప్పున పూచీకత్తు ఇవ్వాలని ..పిటిషనర్లకు 48 గంటల ముందు నోటీసు ఇచ్చాకే విచారించాలని సీఐడీని ఆదేశించారు. ఇకపోతే .. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనరేష్‌కూ ముందస్తు బెయిల్ మంజూరైంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మా ఆరడుగుల బుల్లెట్..! : Home Minister Anitha POWERFUL Speech | CM Chandrababu | Asianet News Telugu
కొండ‌ల‌ను చీల్చి గోదావ‌రిని తీసుకొచ్చిన ఇంజ‌నీరింగ్ అద్భుతం.. పోల‌వ‌రం ఎడ‌మ కాలువ నిర్మాణం