భర్త , మామయ్య అరెస్ట్.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి ధైర్యం చెప్పిన చంద్రబాబు నాయుడు

Siva Kodati |  
Published : Apr 30, 2023, 07:31 PM IST
భర్త , మామయ్య అరెస్ట్.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి ధైర్యం చెప్పిన చంద్రబాబు నాయుడు

సారాంశం

ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.  చిట్‌ఫండ్ కేసులో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు, మామగారు ఆదిరెడ్డి అప్పారావులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

చిట్ ఫండ్ కేసులో టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌లను ఏపీ సీఐడీ ఆదివారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా వుంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్ట్‌లతో ప్రత్యర్ధుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. 

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వున్న  ప్రతీ ఒక్క టీడీపీ నేతను ఇబ్బంది పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వాటి ద్వారా నేతలను లొంగదీసుకోవాలనే ఆలోచనలు మానుకోవాలన్నారు. అక్రమ అరెస్ట్‌లు, కేసులపై ఇప్పటికే కోర్టు చేతిలో చీవాట్లు తిన్నా ప్రభుత్వ బుద్ధి మారలేదన్నారు. రాష్ట్రంలో ఎవరూ వ్యాపారం చేయకూడదు అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు

ALso Read: రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అరెస్ట్

అంతకుముందు .. మాజీ ఎమ్మెల్సీ  ఆదిరెడ్డి అప్పారావు,  ఆయన  తనయుడు  ఆదిరెడ్డి వాసులను   సీఐడీ   అధికారులు  ఆదివారంనాడు  అరెస్ట్  చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో  ఆదిరెడ్డి అప్పారావు  కుటుంబానికి  చిట్ ఫండ్ వ్యాపారాలున్నాయి. దీనిలో అవకతవకలు జరిగాయన్న అభియోగాలపై సీఐడీ అధికారులు వారిని అధికారులు  అరెస్ట్ చేశారు. రాజమండ్రిలోని  తమ కార్యాలయంలో  ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు  వాసులను  సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రాజమండ్రి  ఎమ్మెల్యే  ఆదిరెడ్డి భవానీ   ఆదిరెడ్డి  అప్పారావు కోడలు. ఆదిరెడ్డి అప్పారావు  కుుటంబం గతంలో  వైసీపీలో  ఉండేది. ఆ తర్వాత  వీరి కుటుంబం  టీడీపీలో  చేరింది. రాజమండ్రిలో  ఆదిరెడ్డి భవానీ  టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించింది. 


 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu