ఆ వర్గంతో పోలీసులు కుమ్మక్కు.. చర్యలు తీసుకోండి : డీజీపీకి చంద్రబాబు లేఖ

Siva Kodati |  
Published : Jan 11, 2023, 09:47 PM IST
ఆ వర్గంతో పోలీసులు కుమ్మక్కు.. చర్యలు తీసుకోండి :  డీజీపీకి చంద్రబాబు లేఖ

సారాంశం

రాష్ట్రంలో పోలీసులు ఒక వర్గంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళవారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. 

రాష్ట్రంలో పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బుధవారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై నమోదు చేస్తున్న అక్రమ కేసులపై చంద్రబాబు ప్రస్తావించారు. పుంగనూరులో టీడీపీ నేతలపై కేసులకు సంబంధించి పోలీసులు,రెవెన్యూ అధికారులు ఫిర్యాదుదారులుగా వుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే సెక్షన్ 307 లేదా ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు పెడుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మాచర్ల, కుప్పం, తంబళ్లపల్లె ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్‌లలోనూ ఇదే కనిపిస్తోందన్నారు. 

కొందరు పోలీస్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తెలుగుదేశం మద్ధతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒక వర్గం పోలీసులు, వైసీపీ నేతలు కుమ్మక్కయ్యారని చంద్రబాబు దుయ్యబట్టారు. కొన్నిసార్లు పోలీసులు యూనిఫాం లేకుండానే వచ్చి నిందితులను తీసుకెళ్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso Read: నన్ను ‘పుడింగి’ అన్నావంటే.. నీకంటే బలవంతుడినని ఒప్పుకున్నట్టే.. చంద్రబాబుకు పెద్దిరెడ్డి కౌంటర్...

అంతకుముందు గత శుక్రవారం చిత్తూరు జిల్లా గుడుపల్లెలో రోడ్డుపై బైఠాయించారు చంద్రబాబు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోవో వచ్చాక కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్ షోలు నిర్వహిస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. నన్ను నా నియోజకవర్గంలో తిరగనివ్వరా.. తాను మీటింగ్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా మీరే చెబుతారా అంటూ ఆయన నిలదీశారు. తాను తల్చుకుంటే నాడు పులివెందులకు జగన్ వెళ్లేవాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాహితం కోసమే తన పోరాటమని.. తాను తిరిగితే ప్రజల్లో మీపై తిరుగుబాటు వస్తుందన్నారు. 

మీరు ఎంత ఆపితే ప్రజలు అంతగా తిరగబడతారని ఆయన మండిపడ్డారు. తనను శారీరకంగా ఇబ్బంది పెట్టగలుగుతారని.. ప్రజల కోసం ప్రాణాలైనా ఇచ్చే సంకల్పం తనదేనని చంద్రబాబు పేర్కొన్నారు. పోలీసుల అరాచకం వెనుక సైకో సీఎం వున్నాడంటూ ఆయన ఆరోపించారు. పోలీసులూ ..మీకు మానవత్వం వుందా అని చంద్రబాబు దుయ్యబట్టారు. తనను తన నియోజకవర్గంలో నడిపించడానికి మీకు సిగ్గనిపించడం లేదా  అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలకు ఒక రూల్.. మాకో రూలా అంటూ ఆయన దుయ్యబట్టారు. ఏపీలో సైకో రెడ్డి పాలన కొనసాగుతోందని.. తన ప్రచార రథం తనకు అప్పగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే