మహిళా నేతలు వైసీపీలో వుండలేకపోతున్నారు.. అరాచక పాలన అంతమొందిస్తా : చంద్రబాబు

By Siva KodatiFirst Published Aug 19, 2022, 7:33 PM IST
Highlights

మహిళా నేతలు వైసీపీలో వుండలేకపోతున్నారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రాన్ని కాపాడేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. తన జీవితంలో ఎప్పుడూ వైసీపీలాంటి పార్టీని చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. 

వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో వడ్డెర కులస్తులను ముగ్గురాయి వ్యాపారం చేసుకోనివ్వడం లేదని మండిపడ్డారు. వైసీపీ నాయకురాలు స్వయంగా బాధితులకు అండగా నిలబడితే.. ఆమెను వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏపీయేనన్నారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల మెజార్టీ వుంటే.. రాజ్యాంగం వుందన్నారు. అందులో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యతలు వున్నాయని... రాష్ట్రాన్ని కాపాడేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని చంద్రబాబు తెలిపారు. 

ALso Read:రోడ్లపై మనుషులు చనిపోతుంటే ప్రభుత్వం నిద్రపోతోందా?.. వైసీపీ సర్కార్‌పై చంద్రబాబు ఫైర్

మనసు వున్నవాడేవ్వడూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వుండడని చంద్రబాబు అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పార్టీని చూడలేదని ఆయన పేర్కొన్నారు. వైసీపీలో తనలాంటి గౌరవప్రదమైన మహిళలు వుండలేరని ఉయ్యూరు జడ్పీటీసీ చెప్పిందని చంద్రబాబు గుర్తుచేశారు. పనికంటే.. తన పరువు ముఖ్యమని చెప్పి పదవికి రాజీనామా చేసిందన్నారు. మహారాష్ట్ర నుంచి అనంతపురం ద్రాక్షతోటల్లో పనిచేయడానికి వచ్చిన ముగ్గురు కూలీలు నాసిరకం మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

గవర్నమెంట్ మద్యం దుకాణాల్లోని లిక్కర్ నాణ్యతపై ఎన్నో రోజుల నుంచి టీడీపీ పోరాటం చేస్తోందని ఆయన గుర్తుచేశారు.  డబ్బు కోసం ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ప్రజల్లో బాధ, ఆవేదన వుందన్నారు. తాను మీటింగ్‌లో వుండగానే పోలీసులు ఇక్కడికొచ్చి కేసు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. 
 

click me!