వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురు మాజీ మంత్రులతో పాటు పలువురు తమ పార్టీ నేతలపై కేసులు పెట్టారన్నారు.
అమరావతి: రాష్ట్రంలో DGP మారినా కూడా పోలీసుల తీరు మారలేదని టీడీపీ చీప్ చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు తమ తీరును మార్చుకోకపోతే వారిని తామే మారుస్తామని Chandrababu హెచ్చరించారు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు.
TDP చీఫ్ చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలోనే YCP దమనకాండపై పుస్తకాన్ని చంద్రబాబు విడుదల చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు.. అంతేకాదు వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. నలుగురు మాజీ మంత్రుల్ని కూడా జైలుకు పంపించారని చంద్రబాబు గుర్తు చేశారు. గ్రామస్థాయిలో టీడీపీకి చెందిన 4 వేల మంది కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని చంద్రబాబు చెప్పారు. దళితులు, బీసీలు, గిరిజన నేతలపై వైసీపీ దాడులు, హత్యలు చేసిందని చంద్రబాబు ఆరోపించారు.రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది నేతలపై కూడా కేసులు నమోదు చేశారన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయన్నారు. కొత్త DGP బాధ్యతలు స్వీకరించినా కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన విమర్శలు చేశారు. నేరస్తులకు పోలీసులు వంతపాడే పరిస్థితిలో డీజీపీ ఉన్నాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గంలోనే ఐదు హత్యలు జరిగాయని చంద్రబాబు గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ ఘటనను డైవర్ట్ చేసేందుకు గాను కోనసీమలో చిచ్చు పెట్టారని చంద్రబాబు విమర్శలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తాను సీఎంగా ఉన్న సమయంలో సానుభూతి పొందేందుకు ప్రయత్నించారని చంద్రబాబు విమర్శించారు. వివేకా హత్య కేసులో కీలకంగా ఉన్న వారంతా వరుసగా ఎందుకు చనిపోతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. అఫ్రూవర్ గా ఉన్న దస్తగిరిని కూడా చంపేసతామని బెదిరిస్తున్నారని చంద్రబాబు ప్రస్తావించారు.వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ విశ్వసనీయతకు పెను సవాల్ గా మారిందని చెప్పారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి ఎలా చనిపోయారని ఆయన ప్రశ్నించారు. సీబీఐపై గంగాధర్ రెడ్డితో కేసులు పెట్టించారని చంద్రబాబు ఆరోపించారు.
జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 252 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారన్నారు.422 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. నాటుసారాతో 232 మంది బలయ్యారన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కోట్టుకుపోవడంతో 62 మంది మరణించారని చంద్రబాబు తెలిపారు.టెన్త్ పరీక్షల్లో 2 లక్షల మంది విద్యార్ధులు పెయిలయ్యారని చెప్పారు.