ప్రజలే తిరుగుబాటు చేసేలా చేస్తా: జగన్‌కు బాబు వార్నింగ్

Siva Kodati |  
Published : Oct 03, 2019, 05:55 PM ISTUpdated : Oct 03, 2019, 06:00 PM IST
ప్రజలే తిరుగుబాటు చేసేలా చేస్తా: జగన్‌కు బాబు వార్నింగ్

సారాంశం

టీడీపీ సామాజిక కార్యకర్తలపైన కేసులు పెడుతున్నారని.. వైసీపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని బాబు దుయ్యబట్టారు. ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి తీసుకొస్తానని.. వైసీపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.

ప్రభుత్వం సోషల్ మీడియాను అణచివేస్తోందన్నారు ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అమరావతిలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.

సోషల్ మీడియాలో టీడీపీ మద్ధతుదారులను వేధిస్తుస్తున్నారని.. అదే సమయంలో వైసీపీ వాళ్లు పెట్టే అసభ్యకర పోస్టులపై చర్యలు తీసుకోవడం లేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం ముందు పోలీసులను దోషులుగా నిలబెడతామని.. టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు డీజీపీ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

మీడియా కథకాలు షేర్ చేస్తే అరెస్ట్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.  టీడీపీ సామాజిక కార్యకర్తలపైన కేసులు పెడుతున్నారని.. వైసీపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని బాబు దుయ్యబట్టారు.

ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి తీసుకొస్తానని.. వైసీపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. పోలీసులకు చర్యలకు డీజీపీ సమాధానం చెప్పాలి ఆయన డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్