ఏపీలో విద్యుత్ కోతలు వాస్తవమే: అంగీకరించిన బొత్స

Siva Kodati |  
Published : Oct 03, 2019, 05:19 PM ISTUpdated : Oct 03, 2019, 05:28 PM IST
ఏపీలో విద్యుత్ కోతలు వాస్తవమే: అంగీకరించిన బొత్స

సారాంశం

 రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. బొగ్గు కొరత కారణంగానే విద్యుత్ కొతలు ఎదురవుతున్నాయని బొత్స స్పష్టం చేశారు

గత ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కుంటుపడిందన్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒకటో తేదీనే జీతాలిస్తున్నామని బొత్స స్పష్టం చేశారు.

మున్సిపల్ శాఖలో రూ.15 వేల కోట్ల బకాయిలున్నాయని.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. బొగ్గు కొరత కారణంగానే విద్యుత్ కొతలు ఎదురవుతున్నాయని బొత్స స్పష్టం చేశారు.

ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. 
 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Asianet News Telugu
Vijayawada Police Press Conference: 2025 నేర నియంత్రణపై పోలీస్ కమీషనర్ ప్రెస్ మీట్| Asianet Telugu