
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో , కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయ్యారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరుకు వచ్చిన చంద్రబాబు తిరిగి కుప్పంకు బయల్దేరేందుకు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో డీకే శివకుమార్ కూడా ఓ ప్రాంతానికి వెళ్లేందుకు గాను ప్రత్యేక విమానం వద్దకు వచ్చారు. దీంతో ఇద్దరు నేతలు ఎదురుపడి ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇద్దరూ తమ భద్రతా సిబ్బందిని దూరంగా వుంచి కాస్త పక్కకి వెళ్లి సీక్రెట్‌గా మాట్లాడుకున్నారు. వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత కలిగిస్తోంది.