హత్యకు రెక్కీ.. వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు, అండగా వుంటామని హామీ

By Siva Kodati  |  First Published Jan 1, 2022, 6:52 PM IST

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (vangaveeti radha krishna) ఇంటికి టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) వెళ్లారు. ఈ సందర్భంగా రెక్కీ చేశారన్న అంశంపై రాధా, ఆయన తల్లి వంగవీటి రత్నకుమారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. 


ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (vangaveeti radha krishna) ఇంటికి టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) వెళ్లారు. ఇటీవల తన హత్యకు రెక్కీ చేశారని వంగవీటి రాధా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాధా ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా రెక్కీ చేశారన్న అంశంపై రాధా, ఆయన తల్లి వంగవీటి రత్నకుమారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. 

ఈ సందర్భంగా భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాధాకు టీడీపీ పూర్తిగా అండగా ఉంటుందని... కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని ఆయన భరోసా కల్పించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాధాపై హత్యాయత్నానికి సంబంధించి ఆధారాలున్నా చర్యల్లేవన్నారు. హత్యకు రెక్కీ చేసిన మాట వాస్తవమా?కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రెక్కీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయా? లేదా? అని నిలదీశారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. 

Latest Videos

undefined

Also Read:వంగవీటి రాధా హత్యకు రెక్కీపై ఆధారాలు దొరకలేదు: విజయవాడ సీపీ క్రాంతి రాణా

దోషులను కాపాడేలా ప్రభుత్వం వైఖరి ఉందని... తప్పుడు పనులు చేసేవారిని ఎప్పటికప్పుడు శిక్షించాలని చంద్రబాబు హితవు పలికారు. ఎవరు రెక్కీ చేశారో తెలిసి కూడా వారిని పట్టుకోకుండా, చర్యలు తీసుకోకుండా.. రక్షణ కల్పిస్తామని చెబుతున్నారంటూ దుయ్యబట్టారు. భద్రత కల్పిస్తున్నామని చెప్పి.. అసలు దోషులను తప్పిస్తారా?’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు డిసెంబర్ 29న వంగవీటి రాధాకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై ఆయన ఆరా తీశారు. గన్ మెన్ ను తిరస్కరించడం సరి కాదని ఆయన సూచించారు. భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. రాధాకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు. 

ఇదే సమయంలో వంగవీటి రాధాను హత్య చేసే ఉద్దేశంతో రెక్కీ నిర్వహించిన ఘటనపై చంద్రబాబు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. రెక్కీ నిర్వహించిన ఘటనపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలని ఆయన చెప్పారు. ప్రాథమిక హక్కులను కాపాడాలని ఆయన అన్నారు. వంగవీటి రాధాకు వరుసగా బెదిరింపులు రావడాన్ని బట్టి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. రాధా హత్యకు రెక్కీపై ఇప్పటికే విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణ టాటా స్పందించారు. రెక్కీ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినా.. సీసీ ఫుటేజీని సేకరించి పరిశీలిస్తున్నామని చెప్పారు.  

 

"

click me!