చేతకానితనం, మొండితనం, మూర్ఖత్వం కలగలిస్తే జగన్ ఏడాది పాలన: చంద్రబాబు

By Siva KodatiFirst Published Jun 1, 2020, 8:49 PM IST
Highlights

వైఎస్ జగన్ ఏడాది పాలనపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏడాది పాలనలో ఆయన బడుగు వర్గాలకు నామినేటెట్ పదవులు ఇవ్వకపోగా.. గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారిని వైసీపీ ప్రభుత్వం అవమానించిందని చంద్రబాబు విమర్శించారు. 

వైఎస్ జగన్ ఏడాది పాలనపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏడాది పాలనలో ఆయన బడుగు వర్గాలకు నామినేటెట్ పదవులు ఇవ్వకపోగా.. గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారిని వైసీపీ ప్రభుత్వం అవమానించిందని చంద్రబాబు విమర్శించారు.

Also Read:అసలీ లంకారెడ్డి ఎవరు? ఆ కాంట్రాక్ట్ ఆయనకే ఎందుకంటే: జగన్ పై ఉమ ఫైర్

మండలి ఛైర్మన్ షరీఫ్, డాక్టర్ సుధాకర్ ఘటనలే ఇందుకు నిదర్శనమని టీడీపీ అధినేత ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ‘‘చేతకాని పాలన- అందరికీ వేదన పేరిట మరో వీడియోను చంద్రబాబు నాయుడు షేర్ చేశారు.

ఇకనైనా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకుని సమసమాజ స్థాపనకు కృషి చేయాలని ఆయన హితవు పలికారు. చేతకాక కొంత, మోసపూరిత మనస్తత్వంతో ఇంకొంత, మొండితనం, తన మాటే నెగ్గాలనే మూర్ఖత్వం ఇలాంటి అవలక్షణాల కలగలుపే జగన్ ఏడాది పాలనగా చంద్రబాబు అభివర్ణించారు.

Also Read:నేను చచ్చేంత వరకు వైసిపిలోనే... జగన్ వెంటే: విజయసాయి రెడ్డి

వైసీపీ ఏడాది పాలన అందరికీ వేదననే మిగిల్చిందని ప్రతిపక్షనేత దుయ్యబట్టారు. రాష్ట్రంలో అందరూ భవిష్యత్‌పై బెంగతో ఉన్నారని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు, రైతులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల వారినీ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ చేసిన మోసానికి బీసీలు స్థానిక ఎన్నికల్లో ఏకంగా 10 శాతం రిజర్వేషన్లను పోగొట్టుకున్నారని టీడీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. 
 

click me!