వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి , టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడులు ఆదివారం నాడు కలుసుకున్నారు. తారకరత్నకు నివాళులర్పించిన సమయంలో వీరిద్దరూ కలిశారు.
హైదరాబాద్: రాజకీయాల్లో వారిద్దరూ బద్ద శత్రువులు. నిత్యం పరస్పరం విమర్శలు చేసుకుంటారు. కానీ, ఇవాళ పక్కన పక్కన కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు , వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు ఆదివారం నాడు మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారు.
అవకాశం దొరికితే చాలా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేస్తుంటారు . సోషల్ మీడియాతో పాటు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబుపై, టీడీపీపై విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తుంటారు. అయితే తారకరత్న నివాసంలో చంద్రబాబు, విజయసాయిరెడ్డిలు పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు.
సినీనటుడు నందమూరి తారకరత్న నిన్న రాత్రి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇవాళ ఉదయం తారకరత్న పార్థీవదేహం హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు. నగరంలోని మోకిళ్లలోని తారకరత్న నివాసంలో పార్థీవదేహం ఉంచారు. తారకరత్నకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు , ఆయన భార్య భువనేశ్వరి నివాళులర్పించారు. ఈ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అక్కడే ఉన్నారు. తారకరత్న బౌతికకాయం వద్ద నివాళులర్పించిన తర్వాత చంద్రబాబునాయుడు , విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. నిత్యం ఉప్పు, నిప్పుగా ఉండే వీరిద్దరూ పక్కనే పక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. అనంతరం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు పక్కనే ఉణ్నారు. మీడియా సమావేశం ముగిసిన తర్వాత వెళ్లిపోయే ముందు చంద్రబాబునాయుడు విజయసాయిరెడ్డిని పిలిచి వెళ్తున్నట్టుగా చెప్పారు. ఇద్దరూ ఒకరికొకరు నమస్కారాలు చేసుకున్నారు. చంద్రబాబునాయుడు కారు వద్ద టీడీపీ తెలంగాణ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి , విజయసాయిరెడ్డి మాట్లాడుకున్నారు.
తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి బంధువు. విజయసాయిరెడ్డికి అలేఖ్య కూతురు వరుస అవుతుంది. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లి కూడా విజయసాయిరెడ్డి తారకరత్నను పరామర్శించారు. తారకరత్నక అందుతున్న వైద్య సహయం గురించి అడిగి తెలుసుకున్నారు. విజయసాయిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి వచ్చిన తర్వాత బాలకృష్ణ కూడా విజయసాయిరెడ్డికి ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసిన విషయం తెలిసిందే.
also read:తారకరత్న భౌతికకాయానికి చంద్రబాబు దంపతుల నివాళులు.
ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో సినీ నటుడు తారకరత్న అస్వస్థతకు గురయ్యాడు. కుప్పంలోని రెండు ఆసుపత్రుల్లో చికిత్స నిర్వహించిన తర్వాత బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం తారకరత్న పార్థీవ దేహం వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కూడ విజయసాయిరెడ్డి మాట్లాడారు.