మూడు రాజధానులే రెఫరెండమ్.. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలి : జగన్‌కు టీడీపీ సవాల్

Siva Kodati |  
Published : Sep 14, 2022, 06:44 PM ISTUpdated : Sep 14, 2022, 06:53 PM IST
మూడు రాజధానులే రెఫరెండమ్.. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలి : జగన్‌కు టీడీపీ సవాల్

సారాంశం

మూడు రాజధానుల రెఫరెండమ్‌గా అసెంబ్లీని రద్దు చేయాలని ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న తెలుగుదేశం పార్టీ కోరింది. 3 ముక్కల రాజధానిపై జగన్‌కు నమ్మకం వుంటే అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్ విసిరింది. రేపు అసెంబ్లీ సాక్షిగా ఇదే డిమాండ్ చేస్తామని స్పష్టం చేసింది. 

మూడు రాజధానుల రెఫరెండమ్‌గా అసెంబ్లీని రద్దు చేయాలని ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న తెలుగుదేశం పార్టీ కోరింది. 3 ముక్కల రాజధానిపై జగన్‌కు నమ్మకం వుంటే అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్ విసిరింది. రేపు అసెంబ్లీ సాక్షిగా ఇదే డిమాండ్ చేస్తామని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో జగన్ మాట తప్పారని.. మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని జగన్ ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ కోరింది. సభ సజావుగా జరగకూడదని ప్రభుత్వ ఆలోచన అని.. ప్రభుత్వ మూడున్నరేళ్ల వైఫల్యాలను ఎండగడతామని తెలుగుదేశం స్పష్టం చేసింది. 

ఏపీలో యువత నిర్వీర్యం అయింది.. నిరుద్యోగం పెరిగిందని ప్రధాన ప్రతిపక్షం ఆరోపించింది. జగన్ పాలనలో ప్రజలను పన్నులతో బాదేస్తున్నారని... వైసీపీ ప్రభుత్వంలో వరి వేసుకుంటే ఉరే అనే పరిస్థితుల్లోకి రైతులు వెళ్లారని టీడీపీ ఆవేదన వ్యక్తం చేసింది. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలు పెరిగిపోయాయని ఆరోపించింది. వైసీపీ నేతల ఇసుక, మద్యం దొపిడీకి అడ్డే లేకుండా పోయిందని.. ప్రభుత్వ వైఫల్యాలను సమావేశాల్లో ఎండగడతామని తెలుగుదేశం స్పష్టం చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్