సుజనా ఎఫెక్ట్: రాజ్యసభలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా కనకమేడల

By narsimha lodeFirst Published Jun 21, 2019, 6:05 PM IST
Highlights

రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కనకమేడల రవీంద్రకుమార్‌ను నియమించారు. టీడీపీ నుండి నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో కనకమేడలను ఫ్లోర్ లీడర్‌గా నియమించారు.
 

న్యూఢిల్లీ: రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కనకమేడల రవీంద్రకుమార్‌ను నియమించారు. టీడీపీ నుండి నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో కనకమేడలను ఫ్లోర్ లీడర్‌గా నియమించారు.

టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ సుజనా చౌదరి, టీజీ వెంకటేష్,సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావులు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు.

ఈ నలుగురు ఎంపీలు గురువారం నాడు బీజేపీలో చేరారు. దీంతో రాజ్యసభలో ఇద్దరు ఎంపీలు మిగిలారు. పార్టీ మారిన నలుగురు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని  కోరుతూ టీడీపీ ఎంపీలు శుక్రవారం నాడు వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేశారు.

రాజ్యసభలో టీడీపీ పార్టీ నేతగా కనకమేడల రవీంద్రకుమార్‌‌ను నియమించారు. రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా తోట సీత రామలక్ష్మిని నియమించారు. ఈ మేరకు టీడీపీ ఎంపీలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖను ఇచ్చారు.

click me!