వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యను తమ పార్టీపై రుద్దుతున్నారని మండిపడ్డారు.
జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకు శవ రాజకీయాలకు తెరలేపాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లి రాబంధుల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. వ్యక్తుల మధ్య జరిగిన హ్యతను టీడీపీకి రుద్దుతున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి హత్యా రాజకీయాలకు ఒక కేరాఫ్ అడ్రస్ అని... వైసీపీ పాలనలోనే ముస్లింలపై హత్యలు ఎక్కువగా జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్లుగా జగన్ రెడ్డి మాటలు ఉన్నాయన్నారు.
మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పల్లా శ్రీనివాసరావు... జగన్ రెడ్డి మరోసారి శవ రాజకీయాలు అంటే ఏంటో చూపించారని ధ్వజమెత్తారు. గత 40 ఏళ్లలో ఏరోజూ టీడీపీ హత్యారాజకీయాలు చేయలేదన్నారు. జగన్ రెడ్డి బాధిత కుటుంబం వద్దకు వెళ్లింది పరామర్శకు కాదని.. రాజకీయం చేయడానికని విమర్శించారు. గవర్నర్ ప్రసంగం ఆపుతామని, ఢిల్లీలో ధర్నాలు చేస్తామనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి వైసీపీ నేతలు అబద్దాలు, అసత్యాలతో విషం చిమ్ముతున్నారన్నారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే రాష్ట్రపతి పాలన కోరడం సిగ్గుచేటన్నారు. గిరిజన మహిళతో విజయసాయిరెడ్డి విషయాన్ని డైవక్ట్ చేయడానికే జగన్ రెడ్డి ఈ హత్యారాజకీయాలకు తెరతీశారని విమర్శించారు.
undefined
పల్లా శ్రీనివాసరావు ఇంకా ఏమన్నారంటే...
‘‘టీడీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీలో సగం వాటాను తెలంగాణకు ఇచ్చారని, సుమారు 15మంది కమ్మవారికి మంత్రి పదువులు ఇచ్చారని చెప్పడం, ఇంగ్లీసు మీడియం తీసి తెలుగు మీడియం పెట్టారని చెప్పడం.. ఇలా ఏదో ఒక రకంగా టీడీపీపై అసత్యాలు అబద్దాలతో ఫేక్ ప్రచారమే లక్ష్యంగా పెట్టుకున్నారు వైసీపీ నేతలు. జగన్ రెడ్డి ఒక ఫేక్ పర్సన్... రాజకీయ రాక్షసత్వానికి కేరాఫ్ అడ్రస్. రసీద్ హత్యకు జిలాని కారణం... వారి మధ్య సంవత్సరం నుండే గొడవలు ఉన్నాయి. సంవత్సర క్రితం అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వద్ద వాళ్ల పంచాయితీ జరిగింది. ఆ పంచాయితీ తెగకపోవడంతో ఆ కోపంలోనే ఈ హత్య జరింది. దీన్ని జగన్ రెడ్డి హత్యా రాజకీయాలకు తెరతీశారు. ముస్లిం సోదరులకు టీడీపీ ఎప్పుడూ అండగానే ఉంది. వైసీపీ పాలనలోనే ముస్లిం సోదరులపై హత్యలు జరిగాయి. నంద్యాలలో అబ్దుల్ సలాం అనే వ్యక్తి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నారు. టీడీపీ ఎప్పుడూ ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉంది. జగన్ రెడ్డి ఆయన ఉనికిని కాపాడుకోవడానికి శవరాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడూ కూడా టీడీపీ పార్టీ హత్యా రాజకీయాలకు దూరంగా ఉంటుంది. టీడీపీ పార్టీ అలాంటి వారిని ఉపేక్షించదు. హత్యా రాజకీయాల్లో ఉంటే వారిపై కఠినంగా ఉంటాం. ఇప్పటికైనా జగన్ రెడ్డి ఒక నిర్మాణాత్మకైన పాత్ర పోషించాలి. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయనకు సీఎం పదవిని ఇచ్చారు. ఆయనతోనే రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యం’’ అని పల్లా పేర్కొన్నారు.
‘‘హత్యతో సంబంధం ఉన్నవారందరూ జగన్‌తో పోటోలు దిగారు. రాజకీయ నేతలతో పోటోలు దిగినంత మాత్రాన వారు కూడా దోషులు కారు. 36 రోజులకే తల్లికి వందనం అమలు చేయాలని మాట్లాడటం చాలా దారుణం. మేము చెప్పినట్లే ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. తల్లికి వందనాన్ని కూడా అమలు చేస్తాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒక్కసారే రూ.1000 పెంచి పింఛన్ ఇచ్చారు. ఇకనైనా జగన్ రెడ్డి అసత్యాలను మానుకోని నిర్ణయాత్మకమైన రాజకీయం చేస్తే మేలు’’ అని హితవు పలికారు.