అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎందుకు కాలేదు: జగన్ కు అచ్చెన్నాయుడు కౌంటర్

Published : Jun 14, 2023, 03:46 PM IST
అవినాష్ రెడ్డి  అరెస్ట్ ఎందుకు కాలేదు: జగన్ కు  అచ్చెన్నాయుడు  కౌంటర్

సారాంశం

టీడీపీ ట్రాప్ లో బీజేపీ పడిందని  జగన్, వైసీపీ  చేసిన విమర్శలపై  టీడీపీ ఏపీ చీఫ్  అచ్చెన్నాయుుడు స్పందించారు.

అమరావతి:జగన్ పెద్ద డ్రామా  యాక్టర్ అని  టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు  చెప్పారు. జగన్ కు అస్కార్  రావడం గ్యారెంటీ అని ఆయన  తెలిపారు.బుధవారంనాడు  అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో  అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.ఏపీ సీఎం వైఎస్ జగన్   టీడీపీపై  చేసిన విమర్శలకు  ఏపీ టీడీపీ చీఫ్  అచ్చెన్నాయుడు  స్పందించారు.  బీజేపీ సహకారం లేకుండానే  రాష్ట్రానికి  నిధులు  వచ్చాయా  అని  ఆయన  ప్రశ్నించారు.
బీజేపీ నేతలు విమర్శలు  చేస్తే సమాధానం చెప్పాలన్నారు. 

 బీజేపీ  సపోర్టు లేకుండానే  కడప ఎంపీ అవినాష్ రెడ్డి  అరెస్ట్ ఆగిందా ? అని  ఆయన  ప్రశ్నించారు.  జగన్ పై ఉన్న ఆస్తుల  కేసులు ఎందుకు  ఆగిపోయాయని  అచ్చెన్నాయుడు  ప్రశ్నించారు. బీజేపీ విమర్శలు  చేస్తే జగన్ సమాధానం చెప్పాలన్నారు. కానీ  ఈ విమర్శలతో  తమకేం సంబంధం లేదన్నారు.   టీడీపీ ట్రాప్ లో  బీజేపీ పడిందని వైఎస్ఆర్‌సీపీ  చేసిన విమర్శలను  అచ్చెన్నాయుడు  తప్పుబట్టారు.  

 బీజేపీ సపోర్టు లేకుండానే   రాష్ట్రానికి  రెవిన్యూ లోటు నిధులు వచ్చాయా ? అని  ఆయన  అడిగారు.  బీజేపీ నేతలు  ఇప్పుడే ఎందుకు  మాట్లాడుతున్నారో  వారినే  అడగాలన్నారు. బీజేపీ  తోడు  తనకు లేదని, తాను అమాయకుడిని   జగన్  చెప్పడం  హాస్యాస్పదమని అచ్చెన్నాయుడు  చెప్పారు.అవినాష్ రెడ్డి అరెస్టైతే ,  జగన్ పై  ఉన్న ఆస్తుల కేసు ముందుకు వెళ్తే బీజేపీ , వైఎస్ఆర్‌సీపీ  మధ్య  సంబంధాలు లేవని  ప్రజలు నమ్ముతారని  అచ్చెన్నాయుడు  తెలిపారు.


 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!